Advertisement

వైభవంగా సీతారాముల కల్యాణం

Feb 25 2021 @ 22:43PM
మయూర వాహనంపై ఊరేగుతున్న చెన్నకేశవ స్వామి

- మయూర వాహనంపై ఊరేగిన చెన్నకేశవుడు  

    గద్వాల టౌన్‌, ఫిబ్రవరి 25 : భూ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం గద్వాల కోట ప్రాంగణంలోని రామాలయంలో సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు భూలక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి ఉత్సవమూర్తులను మయూర వాహనంపై కోట ప్రాంగణంలో ఊరేగించారు. శుక్రవారం రాత్రి స్వామి వారి కల్యాణోత్సవం, శనివారం రాత్రి రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్‌ ఉదయ్‌ తెలిపారు. 

Follow Us on:
Advertisement