గరుడ వాహనంపై ఊరేగిన చెన్నకేశవస్వామి

ABN , First Publish Date - 2022-05-18T05:00:23+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం వెల్లాల చెన్నకేశవ, సంజీవరాయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి గరుడోత్సవం వైభవంగా నిర్వహించారు.

గరుడ వాహనంపై ఊరేగిన చెన్నకేశవస్వామి
దేవస్థానం తరుపున పూలమాలలు తీసుకెళుతున్న ఛైర్మన్‌ కానాల విజయలక్ష్మి, సర్పంచ్‌ రాధా, తదితరులు

రాజుపాళెం, మే 17: ప్రముఖ పుణ్యక్షేత్రం వెల్లాల చెన్నకేశవ, సంజీవరాయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి గరుడోత్సవం వైభవంగా నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. ముందుగా వెల్లాల ఛైర్మన్‌ కానాల విజయలక్ష్మి, సర్పంచ్‌ రాధా స్వామివారికి ప్రత్యేక పూలమాలలు సమర్పించారు. రాత్రి ఆర్కెస్ట్రా తదితర కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

చుట్టుపక్కల జనంతో దేవస్థానం క్రిక్కిరిసింది. మంగళవారం సంజీవరాయస్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. బుధవారం రథోత్సవం సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. వర్షం పడినా బండలాగుడు పోటీలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ తెలిపింది. కార్యక్రమం లో ఈఓ శోభా, వైసీపీ నేతలు బలరామిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

మోహినీ అలంకారంలో శ్రీవారు....  

జమ్మలమడుగు రూరల్‌, మే 17: శ్రీదేవి, భూదేవి సమేత  నారాపుర వేంకటేశ్వరస్వామి మోహినీ అ లంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక శ్రీనారాపుర వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భా గంగా మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కుకున్నారు. ఉదయం 8 గంటలకు ఆల య ప్రాంగణలో శ్రీదేవి, భూదేవి సమేత  నారాపుర వేంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారిని మోహినీ అలంకారంలో అలంకరించారు. రాత్రి స్వామివారిని ప్రత్యేకంగా పూజలు నిర్వహించి గరుడ వాహనంలో శ్రీవారికి ఊరేగిం పు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ వెంకటేష్‌, పండితులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.







Updated Date - 2022-05-18T05:00:23+05:30 IST