గుట్టలో గుట్టుగా గంజాయి సాగు

ABN , First Publish Date - 2020-10-24T09:58:43+05:30 IST

తనకల్లు మండల పరిధిలోని చెన్నరాయస్వామి గుడి ప్రాజెక్టు (సీజీపీ) వద్ద ఉన్న గుట్టలో గంజాయి సాగుచేసిన విషయాన్ని తనకల్లు పోలీసులు శుక్రవారం గుర్తించారు.

గుట్టలో గుట్టుగా గంజాయి సాగు

పోలీసుల దాడులు.. మొక్కలు ధ్వంసం


తనకల్లు, అక్టోబరు 23: తనకల్లు మండల పరిధిలోని  చెన్నరాయస్వామి గుడి ప్రాజెక్టు (సీజీపీ) వద్ద ఉన్న గుట్టలో గంజాయి సాగుచేసిన విషయాన్ని తనకల్లు పోలీసులు శుక్రవారం గుర్తించారు. కదిరిరూరల్‌ సీఐ మధు, తనకల్లు ఎస్‌ఐ శ్రీనివాసులు, తనకల్లు వ్యవసాయ అధికారి శ్రీహరినాయక్‌, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ మల్లికార్జున ఆధ్వర్యంలో గంజాయి సాగును ధ్వంసం చేశారు. మండలంలోని ఉంగరాలవారి ఇండ్ల గ్రామానికి చెందిన బయ్యప్పనాయుడు సీజీ ప్రాజెక్టు గుట్టలో పలుచోట్ల ఎవరికీ తెలియకుండా గంజాయి సాగుచేశాడు. విషయం తెలుసుకున్న తనకల్లు పోలీసులు శుక్రవారం కదిరిరూరల్‌ సీఐ ఆధ్వర్యంలో బయ్యప్పనాయుడును అదుపులోకి తీసుకుని గుట్టలో సాగుచేసిన గంజాయి మొ క్కలను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో తనకల్లు పోలీసులతో పాటు కదిరిరూరల్‌ సీఐ కార్యాలయానికి చెందిన పోలీసులు,  పాల్గొన్నారు. 

 

గంజాయి సాగు వెనుక అదృశ్య హస్తం ?

మండల పరిధిలోని సీజీ ప్రాజెక్టు వద్ద గుట్టలో ఉపాధి హామీ కూలీలు తీసిన స్ట్రెంచ్‌లలో బయ్యప్పనాయుడు గంజాయి సాగుచేశాడు. బయ్యప్పనాయుడును చూసిన వ్యక్తులు ఎవరైనా ఇతని వె నుక అదృశ్య హస్తమేదో ఉండి  ఈ పనిచేయించి ఉంటుందన్న అ నుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కనీసం నడవలేని స్థితిలో ఉన్న బయ్యప్పనాయుడు ప్రభుత్వం గతంలో నిర్మించి, పాటుపడిన సీజీ ప్రాజెక్టు బంగ్లా వద్ద ఏకంగా నర్సరీ పెంచి గంజాయి మొక్కలు సాగుచేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు విచారణ చేసి బయ్యప్పనాయుడు గంజాయి సాగుచేస్తున్న విషయంలో అతని వెనుక ఉన్న అదృశ్యం హస్తం ఎవరిదో పరిశోధించి వెలికితీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరు తున్నారు.

Updated Date - 2020-10-24T09:58:43+05:30 IST