చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు రద్దు

ABN , First Publish Date - 2021-04-24T05:05:41+05:30 IST

మార్కాపురం పట్టణంలో వెలసిన్న శ్రీరాజ్యలక్ష్మీ సమేత చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు రద్దు అయ్యాయి. కరోనా నేపథ్యంలో అధికారుల ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవాలను రద్దు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహాణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి శుక్రవారం తెలిపారు. గత ఏడాది కూడా కరోనాతో బ్రహ్మోత్సవాలు రద్దు కాగా... ఈ ఏడాది కూడా అదే విధంగా జరిగింది.

చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు రద్దు
చెన్నకేశవస్వామి ఆలయం (ఫైల్‌)

 

మార్కాపురం (వన్‌టౌన్‌) ఏప్రిల్‌ 23: మార్కాపురం పట్టణంలో వెలసిన్న శ్రీరాజ్యలక్ష్మీ సమేత చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు రద్దు అయ్యాయి. కరోనా నేపథ్యంలో అధికారుల ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవాలను రద్దు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహాణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి శుక్రవారం తెలిపారు. గత ఏడాది కూడా కరోనాతో బ్రహ్మోత్సవాలు రద్దు కాగా... ఈ ఏడాది కూడా అదే విధంగా జరిగింది. చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఏటా ఏప్రిల్‌ నెలలో జరుగుతాయి. ఈ నెల 26 నుంచి 12 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగాల్సి ఉంది. వివిధ శాఖల అధికారుల సూచనల మేరకు ప్రజల ఆరోగ్య దృష్ట్యా బ్రహ్మోత్సవాలు రద్దు చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు.


Updated Date - 2021-04-24T05:05:41+05:30 IST