భవిష్యత్‌లో బహుజనులే రాష్ట్రాన్ని శాసిస్తారు..

ABN , First Publish Date - 2021-03-07T05:12:31+05:30 IST

భవిష్యత్‌లో బహుజనులే రాష్ట్రాన్ని శాసిస్తారు..

భవిష్యత్‌లో బహుజనులే రాష్ట్రాన్ని శాసిస్తారు..
మాట్లాడుతున్న డాక్టర్‌ చెరుకు సుధాకర్‌

తెలంగాణ ఇంటి పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ 


కాళోజీ జంక్షన్‌, మార్చి 6: భవిష్యత్‌లో బహుజనులే తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తారని తెలంగాణ ఇంటి పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ అన్నారు. హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వరంగల్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌ గౌడ్‌ అధ్యక్షతన ‘ఎమ్మెల్సీ ఎన్నికలు-బీసీల పాత్ర’ అనే అంశంపై విస్తృత స్థాయి సమావేశాన్ని శనివారం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా చెరుకు సుధాకర్‌ హాజరై మాట్లాడారు. ఇతర పార్టీల అభ్యర్థులు ప్రశ్నించే గొంతులు కాదు.. పైరవీలు చేసే గొంతులని ఎద్దేవా చేశారు. 2023లో రాజకీయ వేదిక ఏర్పాటు చేసి దొరల పార్టీకి ఘోరీ కట్టిస్తామన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని, తెలంగాణ సాయుధ పోరాట యోధుల ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. సుధాకర్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టభద్రులకు జాజుల విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం రూరల్‌ జిల్లా అధ్యక్షుడు దాడి మల్లయ్య యాదవ్‌, నాయకులు నాగపూరి సురేష్‌, తాళ్లపెల్లి సంపత్‌, నరేందర్‌, జ్ఞానేశ్వర్‌, ఎ..శ్రీకాంత్‌, సంగ వెంకట్రాజ్యం, మాడిశెట్టి అరుంధతి, ధనుంజయ్‌, తిరుపతియాదవ్‌, అన్నారపు యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి

వడ్డెపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో కుటుంబ పాలనను కొనసాగిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని చెరుకు సుధాకర్‌ అన్నారు. హన్మకొండలోని ఆదర్శ న్యాయ కళాశాల, వడ్డెపల్లి ప్రభుత్వ పాఠశాలతో పాటు వరంగల్‌లోని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాళోజీ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌కుమార్‌లను కలిసి ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించిన కరపత్రాలు, బ్యాలెట్‌ నమూనా పత్రాలను అందజేశారు. ఆయన వెంట యువ న్యాయవాదుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ కూనూరు రంజిత్‌గౌడ్‌, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర నేత సాయిని నరేందర్‌, తదితరులున్నారు.

Updated Date - 2021-03-07T05:12:31+05:30 IST