ధోనీ ఫామ్‌హౌస్‌లో ‘చేతక్‌’

ABN , First Publish Date - 2021-05-09T09:31:14+05:30 IST

టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీకి బైక్‌లతోపాటు పెంపుడు జంతువులన్నా ప్రత్యేక అభిమానం. తాజాగా అతడు తన ఫామ్‌హౌ్‌సలోకి ఓ గుర్రాన్ని

ధోనీ ఫామ్‌హౌస్‌లో ‘చేతక్‌’

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీకి బైక్‌లతోపాటు పెంపుడు జంతువులన్నా ప్రత్యేక అభిమానం. తాజాగా అతడు తన ఫామ్‌హౌ్‌సలోకి ఓ గుర్రాన్ని తీసుకొచ్చాడు. దానికి ‘చేతక్‌’ అని పేరు పెట్టాడు. ఈ అశ్వం వీడియోను ధోనీ భార్య సాక్షి నెట్‌లో పోస్టు చేసింది. తమ కుటుంబంలో కొత్త అతిథికి స్వాగతం పలికింది. ధోనీ ఇంట్లో ఈపాటికే నాలుగు శునకాలున్నాయి. అతడి కుమార్తె జివా ఆడుకోవడానికి మరో కొత్త స్నేహితుడు దొరికాడు. కాగా, జడేజా తర్వాత గుర్రాన్ని పెంచుతున్న రెండో క్రికెటర్‌ ధోనీ. 

Updated Date - 2021-05-09T09:31:14+05:30 IST