ససెక్స్‌కు పుజారా.. ట్రావిస్ హెడ్ స్థానంలో ఆడనున్న టీమిండియా బ్యాటర్

ABN , First Publish Date - 2022-03-11T00:50:15+05:30 IST

త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లిష్ కౌంటీ సీజన్ కోసం టీమిండియా బ్యాటర్ చతేశ్వర్ పుజారా ససెక్స్‌తో

ససెక్స్‌కు పుజారా.. ట్రావిస్ హెడ్ స్థానంలో ఆడనున్న టీమిండియా బ్యాటర్

న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లిష్ కౌంటీ సీజన్ కోసం టీమిండియా బ్యాటర్ చతేశ్వర్ పుజారాతో ససెక్స్‌ క్లబ్ ఒప్పందం కుదుర్చుకుంది. తన భార్య తొలి బిడ్డకు జన్మనివ్వనుండడంతోపాటు అంతర్జాతీయ కాంట్రాక్ట్‌లతో బిజీగా ఉండడంతో తనను విడుదల చేయాలంటూ ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ససెక్స్‌ను కోరాడు. అతడి విజ్ఞప్తిని అంగీకరించిన ససెక్స్ క్లబ్.. పుజారాతో ఆ స్థానాన్ని భర్తీ చేసింది. 


ఆగస్టు 2న రాయల్ వన్డే కప్ ప్రారంభం కానుంది. సీజన్ ప్రారంభానికి ముందే పుజారా జట్టులో చేరుతాడని, పోటీలు ముగిసే వరకు జట్టుతోనే ఉంటాడని క్లబ్ పేర్కొంది. ససెక్స్ కుటుంబంలో చేరుతున్నందుకు ఆనందంగా ఉందని పుజారా ట్వీట్ చేశాడు. కాగా, కౌంటీ సీజన్‌లో పుజారాతోపాటు పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కూడా చేరే అవకాశం ఉంది.  

Updated Date - 2022-03-11T00:50:15+05:30 IST