ల్యాప్టాప్లు, కుట్టుమిషన్లు అందుకున్న వారితో సామినేని కోటేశ్వరరావు, మల్లెల హరేంద్రనాథ్చౌదరి తదితరులు
సామినేని కోటేశ్వరరావు
గుంటూరు(తూర్పు), మార్చి27: దాతల సహకారం అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కమ్మజన సేవాసమితి అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు అన్నారు. చేతన ఫౌండేషన్ సహకారంతో ఆదివారం కుందులరోడ్డులోని వసతిగృహంలో విద్యార్థులకు 15 ల్యాప్టాప్లు, లబ్ధిదారులకు 15 కుట్టుమిషన్లు, 2 తోపుడు బండ్లను సమితి ఉపాధ్యక్షుడు మల్లెల హరేంద్రనాథ్చౌదరి, పాలక వర్గసభ్యుడు మర్రిపూడి సీతారామయ్య, ఫౌండేషన్ సభ్యురాలు యార్లగడ్డ రమణిలతో కలసి ఆయన పంపిణీ చేశారు. అనంతరం సామినేని మాట్లాడుతూ వసతిగృహం అభివృద్ధిలో చేతన ఫౌండేషన్ చైర్మన్ వెనిగళ్ళ రవికుమార్ సహకారం మరవలేనిదని కొనియాడారు. భవిష్యత్తులో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు కులమతాలకు అతీతంగా సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వసతిగృహ పాలకవర్గ సభ్యులు, విద్యార్థినులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.