శిథిలావస్థలో చెత్త సంపద కేంద్రాలు

ABN , First Publish Date - 2021-04-18T05:50:25+05:30 IST

చెత్త సంపద కేం ద్రాలు ప్రారంభానికి నోచుకోకుండానే కాలం చెల్లిపోయాయి. కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి.

శిథిలావస్థలో చెత్త సంపద కేంద్రాలు
మొండిగోడలతో మిగిలిన చెత్త సంపద కేంద్రం

బూడిదలో పోసిన పన్నీరులా కోట్ల ఖర్చు

మొక్కుబడి తనిఖీలతో బిల్లులు చేసిన 

ఉపాధిహామీ అధికారులు 

పొదిలి రూరల్‌, ఏప్రిల్‌ 17 : చెత్త సంపద కేం ద్రాలు ప్రారంభానికి నోచుకోకుండానే కాలం చెల్లిపోయాయి. కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. ఉపాధి హామీ అధికారులు మొక్కుబడి తనిఖీలు చేసి బిల్లులు డ్రా చేసి చేతులు దులుపుకున్నారు. ఇక అంతే వాటిని తిరిగి చూసిన నాథుడే లేడు.  పొదిలి మండలంలో అభివృద్ధి పనుల పేరుతో ఇరు పార్టీ నాయకులు, అధికారులు సిండికేటుగా మారి ఇష్టానుసారంగా పనులు చేసి కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. ఆ నిర్మాణాలు ప్రస్తుతం నిరుప యోగంగా మారాయి.  చెత్త సంపద కేంద్రాలు శిథిల మై పడి ఉన్నాయి. అప్పటి ప్రభుత్వంలో నిర్మాణాలు చేపట్టిన చెత్త సంపద కేంద్రాలు పూర్తి కాకుండానే కొన్ని,  సగం పూర్తనవి కొన్ని, పూర్తిగా నిర్మాణాలు జరిగినవి కొన్ని ఉన్నాయి. చెత్త నుంచి సంపద సృష్టించేందుకు నిర్మించిన ఈ షెడ్లు కేవలం నిర్మాణాలతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. లక్ష్యం నెరవేరకపోగా చెత్త సంపద కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి.  కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా అయింది. వాటి  నిర్మాణాలు నాయకులు, అధికారుల జేబులు నింపుకోవడానికే తప్ప ఏమాత్రం ఉపయోగంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యహాత్మగాంఽధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నుంచి సంపదను తయారు చేసేందుకు ఉద్దేశించి నిర్మించిన ఈ పథకాలు ఎందుకు పనికిరాకుండా శిథిలావస్థకు చేరాయి. మండలంలో ఒక్క చోటకూడా పూర్తి స్థాయాలో నిర్మాణాలు పూర్తి చేయకుండానే మొండి గోడలగానే మిగిలిపోయాయి.ఆతరువాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. అర్ధంతరంగా ఆగిపోయిన చెత్త సంపదకేంద్రాలను పూర్తి చేసి ప్రజలకు శాశ్వతంగా  ఉపయోగపడే విధంగా వాటిని ఉపయోగంలోకి తెస్తుందని ప్రజలు ఎదురు చూశారు.  వాటి నిర్మాణాలు పూర్తి చేయకుండా మరో పథకం పేరుతో వాటిని గాలికి వదిలేశారని ప్రజలు విమర్శిస్తున్నారు. మండలంలో మొత్తం 20 పంచాయతీల్లో 14 అసంపూర్తిగా నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. మిగిలిన ఆరు పంచాతీలలో సంపద కేంద్రాలు నిర్మాణలు ప్రారంభం కాలేదు. అ సంపూర్తిగా నిర్మాణాలు జరిగినవి కూడా నాసిరకంగా ని ర్మించారు. ప్రారంభం కాకుండానే అవి గోడలు పగిలి పడిపోతున్నాయి.  పొదిలి మేజర్‌ పంచాయతీ నుంచి సమీకరించిన చెత్తను సమీపంలోని అక్కచెరువు రోడ్డులో ప్రభుత్వ స్థలంలో చెత్త నిల్వ చేసేందు కు సుమారు 12లక్షలతో ఏ ర్పాటు చేసిన సంపద తయారీ కేంద్రం  నిర్మించిన ఏడాదికే బీటలు వా లింది. మొండిగోడలు మిగిలాయి. దీనికోసం రెండు బోర్లు ఏర్పాటు చేశారు. కాని వాటిలో ఒకటి ఉపయోగంలో ఉన్నా ఉపయోగించకపోవడంతో నిరుపయోగంగా పడి ఉంది. ఇక్కడ ఇనుప రేకులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, తాటాకులతో కప్పి నిజాయితీని చాటుకున్నారు. అది కూడా ఈదురగాలులకు నామరూపాలు లేకుండా లేచిపోయి మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి.  ప్రజలకు ఎంతో ఉపయోగపడుతాయని అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆలోచించి ఏర్పాటు చేసిన సంపద కేంద్రాలు ఇప్పుడు తాగుబోతులకు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతు న్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అసం పూర్తిగా ఉన్న వాటిని నిర్మించి, వినియోగంలోకి తెచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుచున్నారు. 


Updated Date - 2021-04-18T05:50:25+05:30 IST