తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి పదవీకాలం పొడిగింపు

ABN , First Publish Date - 2022-04-10T01:45:11+05:30 IST

తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆశలపై సీఎం జగన్ నీళ్లు చల్లినట్లయింది. చెవిరెడ్డి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది.

తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి పదవీకాలం పొడిగింపు

అమరావతి: తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆశలపై సీఎం జగన్ నీళ్లు చల్లినట్లయింది. చెవిరెడ్డి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. తిరుపతి జిల్లా నుంచి ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని అందరూ అనుకున్నారు. ఇంతలోనే తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి పదవీకాలం పొడిగించారు. మరో రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. కేబినెట్ రేసులో ఉన్న చెవిరెడ్డిని తుడా చైర్మన్‌తో ప్రభుత్వం సరిపెట్టింది. కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లా నుంచీ తొలిసారిగా మంత్రి పదవి చెవిరెడ్డికే దక్కుతుందని అందరూ అనుకున్నారు. ఈ జిల్లా పరిధిలోకి వచ్చే ఏడు నియోజకవర్గాల్లో ఎవరూ ప్రస్తుత మంత్రివర్గంలో లేరు. దీంతో చెవిరెడ్డికి మంత్రి పదవి ఖాయమని సమీకరణలు వేసుకున్నారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి వైసీపీ ఆవిర్భావం నుంచీ కూడా జగన్‌ గుడ్‌ లుక్స్‌లో ఉన్నారు. మునుపు కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ, తర్వాత టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయన వేధింపులను, పోలీసు కేసులనూ ఎదుర్కొన్నారని, బాగా ఇబ్బందులు పడ్డాడరన్న సానుభూతి అధినేతలో ఉంది. దానికి తోడు చెవిరెడ్డికి సీఎం కోటరీగా పేరుపడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వంటి ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో చెవిరెడ్డికి జగన్ కేబినెట్‌లో బెర్త్ ఖాయమని అందరూ అనుకున్నారు. ఇంతలోనే తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి పదవీకాలం పొడిగించడం గమనార్హం.

Updated Date - 2022-04-10T01:45:11+05:30 IST