‘చేయూత’తో ఆర్థిక స్వావలంబన సాధించాలి

ABN , First Publish Date - 2021-06-23T04:52:43+05:30 IST

వైఎస్‌ఆర్‌ చేయూత పథకాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పిలుపునిచ్చారు.

‘చేయూత’తో ఆర్థిక స్వావలంబన సాధించాలి
లబ్ధిదారులకు చెక్కును అందచేస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

 లబ్ధిదారులకు చెక్కు అందజేతలో కలెక్టర్‌


నెల్లూరు(హరనాథపురం), జూన 22 : వైఎస్‌ఆర్‌ చేయూత పథకాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పిలుపునిచ్చారు. మంగళవారం తిక్కన భవనలో ఆ పథకం రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు నమూనా చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘చేయూత’ ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ పథకం కింద రెండో విడతలో జిల్లాలోని 1,36,833 మంది రూ.256.56కోట్ల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అందచేసినట్లు చెప్పారు. లబ్ధిదారులకు బ్యాంకు ద్వారా రూ.75వేల రుణం మంజూరు చేయటం వల్ల వారు రిటైల్‌ దుకాణాలు, పాడిపశువులు, గొర్రెల యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఉపాధిని పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. లబ్ధిదారుల జాబితాలో అర్హుల పేర్లు లేకపోతే కాల్‌ సెంటర్‌కు ఫోనచేసి తెలియజేయాలన్నారు. సచివాలయాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కల్యాణ చక్రవర్తి, ట్రైనీ కలెక్టర్‌ ఫర్మాన అహ్మద్‌ఖాన, డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి,  మెప్మా పీడీ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T04:52:43+05:30 IST