2,10,529 మందికి చేయూత లబ్ధి

ABN , First Publish Date - 2021-06-23T05:46:58+05:30 IST

వైఎస్సార్‌ చేయూత పథకంతో జిల్లాలో 2,10,529 మంది మహిళలకు లబ్ధి చేకూరినట్టు హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.

2,10,529 మందికి చేయూత లబ్ధి
లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తున్న హోంమంత్రి సుచరిత, ఉపసభాపతి కోన రఘపతి, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తదితరులు

హోంమంత్రి మేకతోటి సుచరిత


గుంటూరు(తూర్పు), జూన్‌22:  వైఎస్సార్‌ చేయూత పథకంతో జిల్లాలో 2,10,529 మంది మహిళలకు  లబ్ధి చేకూరినట్టు హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యలయం నుంచి ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి వైఎస్సార్‌ చేయూత రెండో ఏడాది నిధులను ఆన్‌లైన్‌ ద్వారా మంగళవారం విడుదల చేశారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ప్రతి లబ్ధిదారునికి ఐదేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. ఆసరా, సున్నావడ్డీ, చేయూత వంటి పఽథకాల ద్వారా ప్రతి మహిళకు రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు  సాయం అందించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. శాసనసభ ఉపసభాపతి కోన రఘపతి మాట్లాడుతూ మహిళా సాధికరత కోసం వైసీపీ కట్టుబడిఉందని తెలిపారు. కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ మాట్లాడుతూ చేయూత పఽథకం ద్వారా జిల్లాలో మొత్తం రూ.394.74 కోట్లను మహిళల ఖాతాల్లో జమచేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, మేయర్‌ కావటి మనోహరనాయుడు, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్‌, మేరుగ నాగార్జున, నంబూరు శంకరరావు, రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ లక్ష్మణరెడ్డి, జేసీ శ్రీధరరెడ్డి, డీఆర్వో కొండయ్య, డిప్యూటీ మేయర్‌ బాలవజ్రబాబు, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌నాయక్‌, ఆర్డీవో భాస్కరరెడ్డి, ఉపాధి కల్పనాధికారి దుర్గాబాయి ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T05:46:58+05:30 IST