‘చేయూత’ లబ్ధిదారుల ఆందోళన

ABN , First Publish Date - 2020-12-04T04:57:33+05:30 IST

చేయూత పథకం ద్వారా చిరు వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా అభి వృద్ధి చెందాలని చెప్పిన ప్రభుత్వం తాజాగా గేదెలు, గొర్రెలు కొన్నవారికే పథకం వర్తింప చేయడం సరికాదని చేయూత లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.

‘చేయూత’ లబ్ధిదారుల ఆందోళన
ఆందోళన చేస్తున్న మహిళలు

పథకంలో కొత్త మార్పులపై ఆగ్రహం 

తొలుత చిరు వ్యాపారాల కోసమని చెప్పి.. ఇప్పుడు గేదెలు,  

 గొర్రెలు  కొంటనే నగదు సాయమనడంపై  మహిళల నిరసన

పామూరు, డిసెంబరు 3 : చేయూత పథకం ద్వారా చిరు వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా అభి వృద్ధి చెందాలని చెప్పిన ప్రభుత్వం తాజాగా గేదెలు, గొర్రెలు కొన్నవారికే పథకం వర్తింప చేయడం సరికాదని చేయూత లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. గురువారం గ్రామ సచివాలయంలో చే యూత పథకం లబ్ధిదారులకు అవగాహన కార్యక్ర మం జరిగింది. ఈ సందర్భంగా పశువైద్యాధికారి ఈ మణి శ్రీసాయి చేయూత పథకంపై అవగాహన కల్పించారు. ఈ పథకం ద్వారా ఆవులు, మేకలు, గేదెలు కొనుగోలు చేసుకున్న వారికి చేయూత నగ దు అందుతుందని శ్రీసాయి తెలిపారు. దీనిపై లబ్ధి దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం ప్రారం భంలో చెప్పిన విధంగా కాకుండా కొత్తగా మా ర్పులు చేయడంతో లబ్ధి దారులకు నష్టమని వారు ఆందోళనకు దిగారు. 

చేయూత పథకం కింద ఎంపికైన మహిళ లకు సంవ త్సరానికి రూ.75 వేల సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతగా రూ.18750 అందించి గేదెలు, మేకలు, గొర్రెలు కొనుగోలు చేసు కుంటే మిగతా మొత్తం మూడు విడతలుగా అం దజేస్తారని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులైన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  చేయూత కింద చిన్న చిన్న వ్యా పారాలతో జీవనోపాధి పొందాలని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు గేదెలు, గొర్రెలు కొనుగోలు చేసు కున్నవారికే సొమ్ము చెల్లిస్తామని చెప్పడం దారుణ మని మహిళలు  నిరసన వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-12-04T04:57:33+05:30 IST