‘చేయూత’తో మహిళల ఆర్థిక స్వావలంబన

Jun 23 2021 @ 01:29AM
లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యేలు నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు


ఎమ్మెల్యేలు కుందురు, రాంబాబు

మార్కాపురం, జూన్‌ 22: మహిళల ఆర్థిక స్వా వలంబనకే వైఎస్సార్‌ చేయూత పథకమని ఎమ్మెల్యేలు కుందురు నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు అన్నారు.  చేయూత రెండో విడత ని ధులను మంగళవారం మహిళల బ్యాంక్‌ ఖాతా లలో జమ చేస్తున్న సందర్భంగా స్థానిక డ్వాక్రా బజారులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మా ట్లాడారు. మహిళలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చే యాలని ఆకాంక్షించారు. దీంతో తమతోపాటు ప లు వురికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చిల్లం చెర్ల బాలమురళీకృష్ణ, ఎంపీడీవో టి.హను మంతరావు, డీఆర్‌డీఏ ఏరియా కోఆర్డినేటర్‌ రవి కుమార్‌, వాల్మీకి, ఆరెకటిక కార్పొరేషన్‌ డైరెక్టర్లు నల్లబోతుల కొండయ్య, సవ్వాని వెంకమ్మ, కౌన్సి లర్‌ దొడ్డా భాగ్యలక్ష్మి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జయమ్మ, డీఆర్‌డీఏ సి బ్బంది శ్రీనివాసరెడ్డి, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

గిద్దలూరులో..

గిద్దలూరు టౌన్‌ : ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, ఆ రంగంలో రాణించినపుడే  లక్ష్యం నెరవేరుతుందని ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం చేయూత పథకంలో భా గంగా 11565 మంది మహిళలకు 21,68,43,750 రూపాయలను పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఈ అవకాశం ఉంటుందన్నారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌,  ఎంపీడీవో రంగనాయకులు, నగర పంచాయతీ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, వైస్‌ చైర్మన్‌ ఆర్‌.డి.రామకృష్ణ, నగర పంచాయతీ కమిషనర్‌ రామకృష్ణయ్య, మాజీ ఎంపీపీ కడప వంశీధర్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ కోటా నరసింహులు, సర్పంచ్‌లు గోపాల్‌, బండి శ్రీనివాసులు, కౌన్సిలర్లు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.