భర్తకు యాక్సిడెంట్ అనగానే.. తెలిసిన వ్యక్తితో బైక్‌పై బయలుదేరిన భార్య.. దారిలో ప్రియుడు కూడా కనిపించాడు.. చివరికి

ABN , First Publish Date - 2021-10-15T11:32:26+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్గీర్ జిల్లాలో ఒక మహిళ మిస్సింగ్ కేసులో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆ మిస్సింగ్ కేసులో విచారణ చేసే కొద్దీ పోలీసులు భయంకరమైన నిజాలు తెలిశాయి. ..

భర్తకు యాక్సిడెంట్ అనగానే.. తెలిసిన వ్యక్తితో బైక్‌పై బయలుదేరిన భార్య.. దారిలో ప్రియుడు కూడా కనిపించాడు.. చివరికి

ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్గీర్ జిల్లాలో ఒక మహిళ మిస్సింగ్ కేసులో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆ మిస్సింగ్ కేసులో విచారణ చేసే కొద్దీ పోలీసులకు భయంకరమైన నిజాలు తెలిశాయి.


జంజ్గీర్ జిల్లాలోని లేబర్ కాలనీలో వార్డు నెంబర్ 20లో అనురాగ్, పద్మ(పేర్లు మార్చబడినవి) అనే దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. ఇద్దరు అమ్మయిలు(7,5), ఒక అబ్బాయి(3). అనురాగ్, పద్మ ఇద్దరూ కూలీ పని చేసుకొని జీవనం సాగించేవారు. కానీ ఒకరోజు భర్త అనురాగ్‌కు ఒంట్లో బాగోలేకపోవడంతో పద్మ ఒంటరిగానే పనికి వెళ్లింది. అలా వెళ్లిన ఆమె ఇంటకి తిరిగిరాలేదు. తరువాతి రోజు అనురాగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్య కనపడటం లేదని ఫిర్యాదు చేశాడు.


పోలీసులు మిస్సింగ్ కేసుగా విచారణ మొదలుపెట్టారు. ఆ విచారణలో ముగ్గురు వ్యక్తులను అనుమానితులుగా అరెస్టు చేశారు. రెండు రోజుల తరువాత ఒక గుర్తు తెలియని మహిళ శవం కాలువలో  దొరికింది. చనిపోయి రెండు రోజులు కావడంతో శవం కుళ్లిపోయింది. ముఖంపై బాగా దెబ్బలు ఉన్నాయి. పోలీసులు అనుమానంతో అనురాగ్‌ను పిలిచి శవాన్ని గుర్తు పట్టమని అడిగారు. అనురాగ్ కూడా ముఖం చూసి గుర్తు పట్టలేకపోయాడు. శవంపై దొరికిన చీరను చూసి భోరున ఏడ్చాడు. అది తన భార్య ఆ రోజు ధరించిన చీర అని గుర్తించాడు.


పోలీసుల కథనం ప్రకారం.. కూలీ పనికి బయలుదేరిన పద్మ ఆ రోజు పని చేసుకుంటుండగా స‌ృజన్ అనే వ్యక్తి బైక్‌పై అక్కడికి వచ్చి అనురాగ్‌కి యాక్సిడెంట్ అయింది. చాలా సీరియస్ అని పద్మకు చెప్పాడు. స‌ృజన్ కూడా అదే లేబర్ కాలనీలో నివసించేవాడు కావడంతో పద్మకు పరిచయం ఉంది. ఇక పద్మ ఏమీ ఆలోచించకుండా కంగారుగా అతనితో బైక్‌పై బయలుదేరింది. స‌ృజన్ అలా పద్మను తీసుకెళుతుండగా దారిలో చంద్రమణి అనే వ్యక్తి కనిపించాడు. చంద్రమణి పద్మను ప్రేమిస్తున్నాని ఇంతకుముందు వేధించేవాడు. చంద్రమణి, స‌ృజన్ కలిసి పద్మను ఒక నిర్మానుషమైన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ చంద్రమని స్నేషితుడు శివ ఉన్నాడు. ఇక ఆ ముగ్గురూ కలిసి పద్మపై అత్యాచారం చేశారు.


ఆ తరువాత పద్మ అందరికీ ఈ విషయం చెప్పి వారిని పోలీసులకు పట్టిస్తానని అనడంతో ఆ ముగ్గురు దుర్మార్గులు దొరికిపోతామని భయపడ్డారు. పద్మను ఆమె చీరతోనే గొంతు బిగించి చంపేశారు. ఆ తరువాత ఆమె ముఖాన్ని రాళ్లతో కొట్టి ఎవరూ గుర్తు పట్టని విధంగా చేశారు. చివరికి పద్మ శవాన్ని ఒక గోనె సంచిలో చుట్టి ఒక పెద్ద కాలువలో పడేశారు. 


పోలీసులు విచారణ చేయగా పద్మతో పని చేసేవాళ్లు స‌ృజన్ ఆ రోజు వచ్చి పద్మను తనతో తీసుకెళ్లాడని చెప్పారు. అలా పోలీసులు స‌ృజన్‌ని పట్టుకోవడంతో అతను జరిగినదంతా చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు స‌ృజన్, చంద్రమణి, శివలపై హత్య, సామూహిక అత్యాచారం(gang rape) నేరాలు మోపి కేసు నమోదు చేశారు. 


Updated Date - 2021-10-15T11:32:26+05:30 IST