ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో అల్పపీడనం.. కోస్తాలో వర్షాలు

ABN , First Publish Date - 2022-07-05T00:17:18+05:30 IST

జార్ఖండ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం ఉదయం ఉత్తర ఒడిశా పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది.

ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో అల్పపీడనం.. కోస్తాలో వర్షాలు

విశాఖపట్నం: జార్ఖండ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం ఉదయం ఉత్తర ఒడిశా పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్యంగా పయనించి ప్రస్తుతం ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో కోస్తాలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో ఎక్కువచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజులపాటు కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురవవచ్చునని పేర్కొంది. ఇంకా సముద్రంలో రుతుపవన కరెంట్‌ బలంగా వున్నందున కోస్తాలో తీరం వెంబడి గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Updated Date - 2022-07-05T00:17:18+05:30 IST