Chhattisgarh: ఆన్‌లైన్‌లో ఆవుపేడ ఉత్పత్తులు

ABN , First Publish Date - 2021-08-14T16:31:41+05:30 IST

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర గోధన్ నయా యోజన పథకం కింద సెల్ప్ హెల్ప్ గ్రూపు మహిళలు ఆన్‌లైన్‌లో ఆవుపేడ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు....

Chhattisgarh: ఆన్‌లైన్‌లో ఆవుపేడ ఉత్పత్తులు

రాజ్‌నందగాం (ఛత్తీస్‌ఘడ్): ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర గోధన్ నయా యోజన పథకం కింద సెల్ప్ హెల్ప్ గ్రూపు మహిళలు ఆన్‌లైన్‌లో ఆవుపేడ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారత కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం కింద రాజ్ నందగాం జిల్లాలో మహిళలు ఆవుపేడతో వర్మీ కంపోస్టు, ఆవుపేడ కేక్స్, హాండిక్రాఫ్ట్ లు తయారు చేస్తున్నారు. ఆవుపేడ ఉత్పత్తులను ఆన్ లైన్ లో విక్రయించడం ద్వారా మహిళలు రూ.1.5కోట్లను ఆర్జించారని, దీనిలో 40 శాతం లాభాలకు మహిళలకు అందించామని రాజ్ నందగాం జిల్లా మెజిస్ట్రేట్ తరణ్ ప్రకాష్ సిన్హా చెప్పారు. రాజ్ నందగాం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలు ఆవుపేడతో వర్మీ కంపోస్టు తయారు చేసి ఈ కామర్స్ ఫ్లాంట్ ఫాంలో విక్రయిస్తున్నారు. 30 మంది మహిళలు ఆవుపేడతో వర్మీకంపోస్టు, ఆవుపేడ కేక్ లు తయారు చేసి విక్రయించడం ద్వారా నెలకు 8వేలరూపాయలు సంపాదిస్తున్నారని అధికారులు చెప్పారు. 

Updated Date - 2021-08-14T16:31:41+05:30 IST