చికెన్ అమ్మకాలపై కార్తీక మాసం ఎఫెక్డ్

ABN , First Publish Date - 2021-11-17T20:51:46+05:30 IST

గత కొన్ని రోజులుగా నాన్ వెజ్ ప్రియులను కలవర పెట్టిన చికెన్ ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి

చికెన్ అమ్మకాలపై కార్తీక మాసం ఎఫెక్డ్

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా నాన్ వెజ్ ప్రియులను కలవర పెట్టిన చికెన్ ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. కార్తీక మాసం కావడంతో చాలా మంది నాన్ వెజ్ ప్రియులు కూడా వెజిటేరియన్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో చికెన్ ధరలు తగ్గాయి. గత నెల రోజుల క్రితం రిటైల్ మార్కెట్ లో కిలో చికెన్ ధర 260 రూపాయలు పలికింది. కానీ ప్రస్తుతం అమ్మకాలు తగ్గడంతో ధరలు కిలోకు 180 నుంచి 190 రూపాయలకు పడిపోయింది. దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే చికెన్ వినియోగం ఎక్కువగా వుంటుంది. 


సాధారణ రోజుల్లోఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకు లక్ష కేజీల చికెన్ వినియోగం అవుతుంది. అలాగే పండగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో అయితే రోజుకు దాదాపు 2 లక్షల చికెన్ వినియోగం జరుగుతుందని వ్యాపారులు తెలిపారు. అయితే ఇప్పడు కార్తీక మాసం ప్రారంభం కావడంతో నాన్ వెజ్ ప్రియులు చాలా మంది తినడం మానేశారు. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 65 నుంచి 75లక్షల చికెన్ అమ్మకాలు జరుగుతున్నట్టు సికింద్రాబాద్ మోండా మార్కెట్ లోని హోల్ సేల్ చికెన్ వ్యాపారి మహ్మద్ ఇస్మాయిల్ తెలిపారు. మరో రెండు వారాల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-11-17T20:51:46+05:30 IST