భారీగా పెరిగిన కోళ్ల దిగుమతులు- పెరిగిన ధర

ABN , First Publish Date - 2021-07-30T20:03:32+05:30 IST

తెలంగాణ రాష్ర్టానికి కోళ్ల దిగుమతి భారీగా పెరిగింది. ఇప్పటికే దేశంలో కోళ్లఉత్పత్తిలో నెంబర్‌ వన్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కోళ్లు డిమాండ్‌కు సరిపడా అందుబాటులో లేక పోవడంతో

భారీగా పెరిగిన కోళ్ల దిగుమతులు- పెరిగిన ధర

హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ర్టానికి కోళ్ల దిగుమతి భారీగా పెరిగింది. ఇప్పటికే దేశంలో కోళ్లఉత్పత్తిలో నెంబర్‌ వన్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కోళ్లు డిమాండ్‌కు సరిపడా అందుబాటులో లేక పోవడంతో పక్క రాష్ర్టాల నుంచి దిగుమతి పెరిగింది. తెలంగాణలో గత రెండు వారాలుగా బోనాల పండగ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈనేపధ్యంలో తెలంగాణలో సాధారణ రోజుల్లో రోజుకు రెండు లక్షల కేజీల చికెన్‌ వినియోగం అవుతోంది. ప్రత్యేకించి హైదరాబాద్‌ నగరంలో రోజుకు లక్షల నుంచి లక్షన్నరకేజీల చికెన్‌ వినియోగం అవుతున్నట్టు తెలంగాణ పౌల్ర్టీ అసోసియేషన్‌కు చెందిన ముఖ్య నాయకుడొకరు తెలిపారు. 


ఇక పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ఒక్క హైదరాబాద్‌ నగరంలో రోజుకు రెండు లక్షల కేజీల చికెన్‌వినియోగం అవుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం బోనాల పండగ నేపధ్యంలో చికెన్‌తో పాటు, కోళ్లను కొనేవారి శాతం పెరిగింది. అమ్మవారికి కోళ్లను కోసి తమ మొక్కులు తీర్చుకోవడం ఆనవాతీగా వస్తోంది. అందుకే తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న కోళ్లతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌ వంటి రాష్ర్టాల నుంచి నుంచి నగరానికి కోళ్లతోపాటు, చికెన్‌ దిగుమతులు బాగా పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. చికెన్‌ వినియోగం ఽఅధికంగా ఉండడంతో పాటు ధరలు కూడా పెరిగాయి. రెండు వారాల క్రితం రిటైల్‌ మార్కెట్‌లో కిలో చికెన్‌ ధర 180 రూపాయల నుంచి 200 రూపాయలు పలికింది. కానీ ప్రస్తుతం 240 నుంచి 260 రూపాయలు పలుకుతోంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

Updated Date - 2021-07-30T20:03:32+05:30 IST