చకచకా క్రీడాప్రాంగణం పనులు

ABN , First Publish Date - 2022-05-29T06:05:00+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన క్రీ డా ప్రాంగణాల ఏర్పాటు పనులు సీఎం దత్తత గ్రామం వాసాల మర్రిలో చకచకా కొనసాగుతున్నాయి. శనివారం అధికారులు గ్రా మాన్ని సందర్శించి గ్రామంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. వాసాలమర్రిని జిల్లాలో ఫైలెట్‌ ప్రాజెక్టుగా అధికారులు ఎంపిక చేశారు.

చకచకా క్రీడాప్రాంగణం పనులు
వాసాలమర్రిలో సాగుతున్న క్రీడాప్రాంగణం పనులు

తుర్కపల్లి, మే 28: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన క్రీ డా ప్రాంగణాల ఏర్పాటు పనులు సీఎం దత్తత గ్రామం వాసాల మర్రిలో చకచకా కొనసాగుతున్నాయి. శనివారం అధికారులు గ్రా మాన్ని సందర్శించి గ్రామంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. వాసాలమర్రిని జిల్లాలో ఫైలెట్‌ ప్రాజెక్టుగా అధికారులు ఎంపిక చేశారు. గ్రామంలోని విశ్వాస్‌ వెంచర్‌లో గ్రామ క్రీడా ప్రాంగణంకోసం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు ఏర్పాటు పనులు ముమ్మరం గా కొనసాగుతున్నాయి. నాలుగైదు రోజుల్లో క్రీడా ప్రాంగణం ప నులు పూర్తియ్యేలా పనులు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ క్రీడా ప్రాంగణాన్ని అధికారులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పనులను పరిశీలించిన వారిలో మండల పత్యేకాధికారి శ్యాంసుందర్‌రావు, తహసీల్దార్‌ పి.రవికుమార్‌, ఎంపీడీవో ఉమాదేవి, సర్పంచ్‌ ఆంజనేయులు ఉన్నారు. 

Updated Date - 2022-05-29T06:05:00+05:30 IST