CJI NV Ramana: శాసన వ్యవస్థపై సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-07-17T04:12:58+05:30 IST

శాసన వ్యవస్థపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనవ్యవస్థ పనితీరులో నాణ్యత క్షీణిస్తోందని..

CJI NV Ramana: శాసన వ్యవస్థపై సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: శాసన వ్యవస్థపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనవ్యవస్థ పనితీరులో నాణ్యత క్షీణిస్తోందని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. రాజకీయ విభేదాలు శత్రుత్వంగా మారకూడదని, రాజకీయ వైరం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య పరస్పరం గౌరవం ఉండేదని, కానీ ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య దూరం పెరగడం దురదృష్టకరమని సీజేఐ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భారత్‌ ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యమని మనం గమనించాలని, భారతదేశం 'పార్లమెంటరీ ప్రభుత్వం' కాదని సీజేఐ ఎన్వీ రమణ గుర్తుచేశారు. మన బహుళత్వాన్ని కాపాడుకోవడానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒక మార్గమని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. రాజస్థాన్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ ఎన్వీ రమణ '75 ఏళ్ల పార్లమెంట్ ప్రజాస్వామ్యం' అంశంపై ప్రసంగించారు.

Updated Date - 2022-07-17T04:12:58+05:30 IST