ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం : చిరుమర్తి

ABN , First Publish Date - 2021-05-10T06:53:26+05:30 IST

ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరం లాంటిదని ఎ మ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం : చిరుమర్తి
కట్టంగూర్‌లో బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే లింగయ్య

కట్టంగూర్‌ / నార్కట్‌పల్లి / కేతేపల్లి / నకిరేకల్‌, మే 9 : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరం లాంటిదని ఎ మ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం ఆయన కట్టంగూ ర్‌ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 19మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య, జడ్పీటీసీ తరాల బలరాములు, మండల అధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, సర్పంచ్‌లు గుర్రం సైదులు, గడుసు అనిత, ప్రసాద్‌, దానయ్య, కన్నయ్య పా ల్గొన్నారు. నార్కట్‌పల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే  చిరుమర్తి లింగయ్య ఆయన స్వగృహంలో అందించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు దుబ్బాక శ్రీధర్‌, దోసపాటి విష్ణుమూర్తి, బొబ్బలి దేవేందర్‌ పాల్గొన్నారు. స్థానిక బీసీ కాలనీలో బొబ్బలి అశోక్‌ నివాసంలో నిర్వహించిన  మల్లన్న దేవుని పండగ వేడుకలో ఎమ్మెల్యే లింగయ్య పాల్గొన్నారు. కేతేపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను నకిరేకల్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చి రుమర్తి లింగయ్య పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ వైస్‌ చైౖర్మన్‌ కె.సైదిరెడ్డి, డైరెక్టర్‌ డి.సునీత, కేతేపల్లి ఎంపీటీసీ వెంకన్నయాదవ్‌, కొత్తపేట సర్పంచ్‌ బి.జానకిరాములు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎం.వెంకటరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. నకిరేకల్‌, కేతేపల్లి మండలాలకు చెందిన 30మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి మంజూరైన రూ.8లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య క్యాంపు కార్యాలయంలో వారికి అందించారు.  కార్యక్రమంలో నకిరేకల్‌ మునిసిపల్‌ చైర్మన రాచకొండ శ్రీనివాస్‌, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, మార్కెట్‌ చైర్‌పర్సన నడికుడి ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-10T06:53:26+05:30 IST