ముస్లింలను దగా చేసిన ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2022-06-25T06:00:09+05:30 IST

గత ప్రభుత్వం ఇస్తున్న దుల్హాన పథకానికి మరో రూ.50వేలు కలిపి రూ.లక్ష ఇచ్చి వైఎస్‌ఆర్‌ దుల్హాన పథకంగా అమలు చేస్తామని... పేద ముస్లిం జంటలకు అండగా ఉంటామని చెప్పిన ముఖ్య మంత్రి జగన ఇప్పుడు సాక్షాత్తు హైకోర్టులోనే ఆ పథకాన్ని కొనసాగిం చలేమని చెప్పడంతో ముస్లింలను దగా చేశారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్‌ విమర్శించారు.

ముస్లింలను దగా చేసిన ముఖ్యమంత్రి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కందికుంట

ఇస్లాం బ్యాంక్‌ ఉత్తుత్తి బ్యాంకేనా..? 

మైనార్టీ పక్షపాతి ఎవరు..? 

27న పంటల బీమాపై ధర్నా: కందికుంట

కదిరి, జూన 24: గత ప్రభుత్వం ఇస్తున్న దుల్హాన పథకానికి మరో రూ.50వేలు కలిపి రూ.లక్ష ఇచ్చి వైఎస్‌ఆర్‌ దుల్హాన పథకంగా అమలు చేస్తామని... పేద ముస్లిం జంటలకు అండగా ఉంటామని చెప్పిన ముఖ్య మంత్రి జగన ఇప్పుడు సాక్షాత్తు హైకోర్టులోనే ఆ పథకాన్ని కొనసాగిం చలేమని చెప్పడంతో ముస్లింలను దగా చేశారని మాజీ ఎమ్మెల్యే,  టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్‌ విమర్శించారు.  ఆయన శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో మాట్లాడుతూ... ఎన్నికల ముందు ముఖ్యమంత్రి తాను మైనార్టీ పక్షపాతిని అంటూ, ఎన్నో హామీలిచ్చారన్నారు. పేద మైనార్టీల వివాహానికి దుల్హాన పథకం కింద రూ.లక్ష  మంజూరు చేస్తామని చెప్పిన ట్లు గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఆపథకాన్ని అమలు చేయలేమని, డబ్బులు లేవని చెప్పడం పేద ముస్లింలను మోసం చేయడమే అన్నారు. గత టీడీపీ పాలనలో ముస్లిం మైనార్టీలకు అనేక పథకాలను అమలు చేశామన్నారు. దుల్హానతో పాటు దుకానమకాన, రంజాన తోఫా, పేద ము స్లిం విద్యార్థుల విదేశీ విద్యకు, హజ్‌ యాత్రకు ఆర్థికసాయం అందించా మన్నారు. ఇప్పుడా పథకాలన్నీ ఎత్తివేసి మైనార్టీలను దగాచేశారని ఆయన మండిపడ్డారు. మా ముఖ్యమంత్రి ముస్లిం పక్షపాతని చెప్పే స్థానిక ప్ర జాప్రతినిధులు వాటిపై ఇప్పుడు ఆయనను నిలదీయాలన్నారు. వచ్చే మంగళవారం వరకు స్థానిక నేతలకు సమయం ఇస్తామని, దుల్హాన పథకంపై స్పందించకపోతే... తాము జూలై 1వ తేదీ శుక్రవారం రోజున ముస్లిం మైనార్టీల తరపున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్లు దాదెం శివారెడ్డి, కొండయ్య, రాజశేఖర్‌ బాబు, శ్రీనివాసులు తదితరులున్నారు. 

 27న పంటల బీమాపై ఆర్డీఓ కార్యాలయం ముట్టడి

నియోజకవర్గ వ్యాప్తంగా వేరుశనగ రైతులకు పంటల బీమా అందకపో వడంపై రైతుల తరపున ఈనెల 27న కదిరి ఆర్డీఓ కార్యాలయాన్ని ట్రాక్టర్ల తో ముట్టడించనున్నట్లు కందికుంట వెంకటప్రసాద్‌ తెలిపారు.  రైతులు, కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. 

దుల్హన  అమలు చేయాలి: మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ 

కదిరి: పేద ముస్లిం యువతులకు పెళ్లి సమయంలో అందించే దుల్హాన పథకాన్ని ప్రభుత్వం నిలిపివేయడం అన్యామని, దాన్ని అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పట్టణంలోని తన నివాసంలో ప్రభుత్వాన్ని కోరారు. మైనార్టీల పథకాలను వైసీపీ ప్రభుత్వం ఆపివేయడం దారుణమన్నారు. రంజాన తోఫాతోపాటు ఇతర పథకాలను కూడా నిలిపివేసిందని ఆవేదన చెందారు.  కార్యక్రమంలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.



Updated Date - 2022-06-25T06:00:09+05:30 IST