అసత్యాలు ప్రచారం చేస్తున్నారు

ABN , First Publish Date - 2021-03-06T09:13:36+05:30 IST

మీడియా, సోషల్‌ మీడియాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాలు ఎక్కడ నుంచి మొదలవుతున్నాయో గుర్తించి, వాటిని నిరోధించేలా చర్యలు తీసుకోవడంతోపాటు వాస్తవం ఏమిటనేది ప్రజల్లోకి విస్తృతంగా

అసత్యాలు ప్రచారం చేస్తున్నారు

ఫ్యాక్ట్‌ చెక్‌ సైట్‌తో వాటికి చెక్‌ పెడతాం: సీఎం


మీడియా, సోషల్‌ మీడియాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాలు ఎక్కడ నుంచి మొదలవుతున్నాయో గుర్తించి, వాటిని నిరోధించేలా చర్యలు తీసుకోవడంతోపాటు వాస్తవం ఏమిటనేది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్‌, ట్విట్టర్‌ ఖాతాను ఆయన ప్రారంభించారు. ‘‘దురుద్దేశపూర్వకంగా పలు మీడియాల్లో ప్రభుత్వంపై ప్ర చారం చేస్తున్నారు. ఈ ప్రచారాలను ఆధారాలతోసహా ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వేదికగా ప్రభుత్వం ఖండిస్తుంది.  జరుగుతున్న ప్రచారం తప్పో ఒప్పో సాక్ష్యాధా రాలతో సహా చూపిస్తారు. నిజమేంటో, అబద్ధమేంటో ప్రజలకు వివరిస్తారు. ఒకవేళ దురుద్దేశపూరిత ప్రచారం అని తేలితే అధికారులూ చర్యలు తీసుకోవాలి. అలాంటి ప్రచారం మొదట ఎక్కడనుంచి మొదలైందో గుర్తించి, చట్టప్రకారం వ్యవహరించాలి. ఒక వ్యక్తి ప్రతిష్ఠను, వ్యవస్థ ప్రతిష్ఠను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే హక్కు ఏఒక్కరికీ లేదు.’’ అని సీఎం జగన్‌ హెచ్చరించారు. 

Updated Date - 2021-03-06T09:13:36+05:30 IST