మట్టిలో కూరుకుపోయిన మహిళ

May 9 2021 @ 00:14AM

కాపాడిన స్థానికులు, పోలీసులు 


చిలకలూరిపేట, మే 8: నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద గుంత తీస్తుండగా పిల్లర్‌ పక్కకు ఒరిగి మహిళ మట్టిలో కూరుకుపోయిన ఘటన చిలకలూరిపేట మండలంలోని కోమటినేనివారిపాలెంలో శనివారం జరిగింది. గోవిందపురం మార్గంలో అరిగెల సుధాకర్‌, అతని పాలపర్తి మనోహరి కూలి ఇంటి నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. మెట్ల కింద గుంత తీస్తుండగా పిల్లర్‌ పక్కకు ఒరిగి మనోహరి గుంతలో సగం వరకు ఇరుక్కుపోయింది. రూరల్‌ ఎస్‌ఐ భాస్కర్‌, స్థానికులు అక్కడికి చేరుకుని పొక్లెయినర్‌తో మట్టి తీయించి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ఆమెను నరసరావుపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.