చట్టాలపై బాలికలకు అవగాహన అవసరం

ABN , First Publish Date - 2022-01-24T05:30:00+05:30 IST

చట్టాలపై బాలికలకు అవగాహన అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెకట్రరీ, జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాసులు నాయక్‌

చట్టాలపై బాలికలకు అవగాహన అవసరం

సంగం, జనవరి 24: చట్టాలపై బాలికలకు అవగాహన అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెకట్రరీ, జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాసులు నాయక్‌ పేర్కొన్నారు. సోమవారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భం గా స్థానిక బాలయోగి సాంఘీక సంక్షేమ బాలికల గురుకు ల పాఠశాలలో న్యాయ సేవాధికారి సంస్థ అధ్వర్యంలో అవ గాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాసులు నాయక్‌ మాట్లాడుతూ విద్యతోనే బాలికలకు మనోవికాస చైతన్యం, ఆర్థిక స్వాతంత్రం చేకూరుతుందని పేర్కొన్నారు. అనంతరం తహసీల్దారు నిర్మలానందబాబా, ఎస్‌ఐ నాగార్జునరెడ్డి దిశ యాప్‌, బాలికల విద్య, సామాజిక చైతన్యం తదితర అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గురుకుల కళాశాల సిబ్బందితోపాటు సర్పంచు రమణమ్మ, ఐసీడీఎస్‌, సాంఘీక సంక్షేమ అధికారులు, బాలికలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T05:30:00+05:30 IST