భీమిలి, మధురవాడల్లో బాలల సంరక్షణ కేంద్రాలు

ABN , First Publish Date - 2021-05-11T04:34:16+05:30 IST

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు, కొవిడ్‌ బారినపడి తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేరినటువంటి పిల్లల కోసం భీమిలి, మధురవాడల్లో బాలల సంరక్షణ కేంద్రాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.

భీమిలి, మధురవాడల్లో బాలల సంరక్షణ కేంద్రాలు

భీమునిపట్నం, (రూరల్‌) మే 10: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు, కొవిడ్‌ బారినపడి తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేరినటువంటి పిల్లల కోసం భీమిలి, మధురవాడల్లో బాలల సంరక్షణ కేంద్రాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలలో చేరిన పిల్లల సంరక్షణ బాధ్యతలను చూడడంతో పాటు వారికి ఉచిత వసతి, భోజన సదుపాయాలను కల్పిస్తున్నారు. అవసరమైనవారు 9963400600 సెల్‌ నంబర్‌ను సంప్రదించవచ్చు.


Updated Date - 2021-05-11T04:34:16+05:30 IST