చిన్నారిని బలిగొన్న నీటిగుంత.. ఆడుకుంటూ వెళ్లి మృత్యుఒడి చేరిన బాలుడు

ABN , First Publish Date - 2021-02-19T05:17:24+05:30 IST

బుడిబుడి అడుగులతో ఇల్లంతా కలియ తిరిగే అభంశుభం తెలియని ఆ 11 నెలల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవ శాత్తు నీటిగుంతలో పడి మృతిచెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గాంధీ నగర్‌లో గురువారం జరిగింది.

చిన్నారిని బలిగొన్న నీటిగుంత.. ఆడుకుంటూ వెళ్లి మృత్యుఒడి చేరిన బాలుడు
బాలుడు మృతదేహం వద్ద రోధిస్తున్న తల్లి, బంధువులు

భద్రాద్రి జిల్లా గాంధీనగర్‌లో విషాధం 

జూలూరుపాడు, ఫిబ్రవరి18: బుడిబుడి అడుగులతో ఇల్లంతా కలియ తిరిగే అభంశుభం తెలియని ఆ 11 నెలల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవ శాత్తు నీటిగుంతలో పడి మృతిచెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గాంధీ నగర్‌లో గురువారం జరిగింది. గాంధీనగర్‌కు చెందిన బోడా ప్రసాద్‌, అరుణ దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు తన్మయశ్రీ వయసు రెండేళ్లు కాగా.. కుమారుడు తన్వీష్‌ వయసు 11 నెలలు. కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీసే ఈ దంపతులకు గురువారం తీరని విషాదమే మిగిలింది. ప్రసాద్‌ ఉదయాన్నే మిర్చి బస్తాలు తొక్కే పనికి వెళ్లగా.. అరుణ ఇంటిపనిలో నిమగ్నమైంది. ఈ సమయంలో తన్వీష్‌ ఆడుకుంటూ ఆడుకుంటూ తమ ఇంటి సమీపంలోని తాతయ్య బోడా బాలు ఇంటివైపు వెళ్లి.. ఆయన ఇంటి ఎదురుగా ఉన్న వృథానీటిని మళ్లించేందుకు ఏర్పాటు చేసిన గుంతలో పడి.. అందులో నిల్వ ఉన్న నిటిలో మునిగిపోయాడు. కొద్ది సేపటి తర్వాత కుమారుడు కనిపించడం లేదంటూ తల్లి అరుణ చుట్టుపక్కల ఇళ్లలో వెతికినా కనిపించకపోవడంతో.. అనుమానం వచ్చిన గుంతలో చూడగా బాలుడు అందులో కనిపించాడు. వెంటనే అతడిని జూలూరుపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చగా.. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో అల్లారుముద్దుగా పెంచుకుం టున్న తమ కుమారుడు ఇలా విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెల విసేలా రోదించారు. ఇది ఇలా ఉండగా 2019 జనవరిలో ప్రసాద్‌ సోదరుడు రవి కుమార్తె గౌతమి.. గాంధీనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఇప్పటికీ ఆ సంఘటన నుంచి వారి కుటుంబం కోలుకోకముందే అదే కుటుం బంలో మరో విషాదం జరగిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-02-19T05:17:24+05:30 IST