కాకిని కాపాడిన బాలుడికి ప్రశంసలు

ABN , First Publish Date - 2021-07-22T14:23:06+05:30 IST

మాంజా దారానికి చిక్కుకొని ప్రాణాలతో విలవిలలాడుతున్న కాకిని పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సాయంతో కాపాడిన బాలుడిని పలువురు ప్రశంసించారు. స్థానిక పోరూర్‌

కాకిని కాపాడిన బాలుడికి ప్రశంసలు

పెరంబూర్‌(చెన్నై): మాంజా దారానికి చిక్కుకొని ప్రాణాలతో విలవిలలాడుతున్న కాకిని పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సాయంతో కాపాడిన బాలుడిని పలువురు ప్రశంసించారు. స్థానిక పోరూర్‌ కారంపాక్కం అరుణాచలం నగర్‌కు చెందిన సంజీవ్‌ (11) ఆరో తరగతి చదువుతున్నాడు. సంజీవ్‌ మంగళవారం సాయంత్రం యోగా చేసేందుకు మిద్దెపైకి వెళ్లిన సమయంలో ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుపై మాంజా దారంలో చిక్కుకున్న కాకిని గమనించాడు. వెంటనే కారంబాక్కంలో ఉన్న బూత్‌కు వెళ్లి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడకు చేరుకొని కాకిని రక్షించేందుకు ప్రయత్నించినా విఫలం కావడంతో, రామాపురం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకొని దారం నుంచి కాకిని రక్షించి గాలిలోకి వదిలారు.

Updated Date - 2021-07-22T14:23:06+05:30 IST