కారు ఢీకొని చిన్నారి మృతి

ABN , First Publish Date - 2020-09-27T23:41:01+05:30 IST

పార్కింగ్ స్థలం నుంచి కారును వెనక్కి తీస్తుండగా ఓ చిన్నారి కారు కింద పడి మృతి చెందింది...

కారు ఢీకొని చిన్నారి మృతి

పార్కింగ్ నుంచి కారు వెనక్కి తీస్తుండగా ప్రమాదం


నిజామాబాద్: కంటేశ్వర్ ప్రాంతంలోని శివం అపార్ట్‌మెంట్స్‌‌లో విషాద ఘటన జరిగింది. అపార్ట్‌మెంట్స్‌‌లో పార్కింగ్ స్థలం నుంచి కారును వెనక్కి తీస్తుండగా ఓ చిన్నారి కారు కింద పడి మృతి చెందింది. పార్కింగ్ స్థలం నుంచి ఓ యువకుడు అజాగ్రత్తగా కారును వెనక్కి తీయగా అక్కడ ఆడుకుంటున్న వాచ్‌మన్ బోని కూతురు మనస్వి తలపై నుంచి కారు వెళ్లింది. దీంతో ఏడాదిన్నర వయస్సు గల మనస్విని అక్కడికక్కడే మృతి చెందడంతో విషాదం నెలకొంది.

Updated Date - 2020-09-27T23:41:01+05:30 IST