బాల కార్మికులను బడిలో చేర్పించాలి

ABN , First Publish Date - 2021-07-25T05:44:30+05:30 IST

బాలలను కార్మికులుగా చేయకుండా బడిలో చేర్చాలని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ లక్ష్మీ తెలిపారు. శనివారం మండలంలోని మల్లూర్‌, వడ్డేపల్లి, జక్కాపూర్‌ గ్రామాల్లో హోటళ్లు, కిరాణ, కల్లు దుకాణాలను తనిఖీ చేశారు.

బాల కార్మికులను బడిలో చేర్పించాలి

ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ లక్ష్మీ
నిజాంసాగర్‌, జూలై 24: బాలలను కార్మికులుగా చేయకుండా బడిలో చేర్చాలని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ లక్ష్మీ తెలిపారు. శనివారం మండలంలోని మల్లూర్‌, వడ్డేపల్లి, జక్కాపూర్‌ గ్రామాల్లో హోటళ్లు, కిరాణ, కల్లు దుకాణాలను తనిఖీ చేశారు. చిన్నారులతో పని చేయించుకుంటే కఠిన చర్యలు త ప్పబోవని ఆమె హెచ్చరించారు. బాల కార్మికుల సర్వే మండలంలో వారం రోజులపాటు కొన సాగుతుందని తెలిపారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు. ఈ సర్వేలో శ్రీధర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ సురేష్‌ కుమార్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు సావిత్రి, సాయవ్వలు తదితరుల ఉన్నారు.

Updated Date - 2021-07-25T05:44:30+05:30 IST