చాముండాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆ మాంత్రికుడు చేసిన ఘోరమిదే...

ABN , First Publish Date - 2022-06-29T16:37:25+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చాముండాదేవిని...

చాముండాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆ మాంత్రికుడు చేసిన ఘోరమిదే...

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చాముండాదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఓ తాంత్రికుడు రెండున్నరేళ్ల చిన్నారిని బలి ఇచ్చాడు. నిందితుడు భోలా అలియాస్ హుకుమ్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదంతం జూన్ 15న జగ్నేర్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో చోటు చేసుకుంది. చాముండా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామానికి చెందిన తాంత్రికుడు రామావతార్ కొడుకు హృతిక్‌ని బలి ఇచ్చాడు. ఇది ఎవరికీ తెలియకుండా ఉండేందుకు నిందితుడు ఆ చిన్నారి మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి కిబార్ నదిలో పడేశాడు. కొడుకును వెదుకుతూ రామావతార్ పలుచోట్ల గాలించాడు. 


ఆచూకీ లభించకపోవడంతో జాగ్నేర్ పోలీస్ స్టేషన్‌లో చిన్నారి అదృశ్యంపై ఫిర్యాదు చేశాడు. పోలీసుల గాలింపులో చిన్నారి మృతదేహం లభ్యమైంది. ఇందుకు ఓ వ్యక్తి పోలీసులకు సహకరించాడు. ఆ మాంత్రికునితో చిన్నారి హృతిక్‌ వెళ్లడాన్ని చూశానని ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు.  కాగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు హుకుమ్ సింగ్ అలియాస్ భోలా హృతిక్ తండ్రి రామ్ అవతార్‌ దగ్గరున్న విలువైన భూమిపై కన్నేశాడు. తన ప్లాన్‌లో భాగంగా హృతిక్‌ని దత్తత తీసుకున్నాడు. హృతిక్‌ని చంపితే రామ్ అవతార్ గ్రామం వదిలి వెళ్లిపోతాడని హుకుమ్ సింగ్ భావించాడు. అప్పుడు అతని భూమిని స్వాధీనం చేసుకోవచ్చని అనుకున్నాడు. ఒకే బాణంతో రెండు లక్ష్యాలను చేధించాలని హుకుమ్ సింగ్ ప్లాన్ చేశాడు. మంత్ర తంత్రాల మీద నమ్మకమున్న హుకుమ్ సింగ్ చాముండా దేవి అనుగ్రహంతో తన కోరిక నెరవేరుతుందని భావించాడు. ఆగ్రా రూరల్ ఎస్పీ సత్యజిత్ గుప్తా ఈ కేసు గురించి మాట్లాడుతూ నిందితుడు హుకుమ్ సింగ్ అమ్మవారి అనుగ్రహం కోసం ఆ చిన్నారిని టార్గెట్ చేశాడు. బావి దగ్గర ఆడుకుంటున్న ఆ చిన్నారిని హత్య చేశారు. ఆ తరువాత మృతదేహాన్ని దేవత ముందు ఉంచి మంత్రాలను జపించాడు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి కిబార్ నదిలో పడేశాడని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు. 


Updated Date - 2022-06-29T16:37:25+05:30 IST