ఢిల్లీలో Child Trafficking Racket గుట్టు రట్టు...8మంది అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-18T13:17:01+05:30 IST

పిల్లల అక్రమ రవాణాదారుల సిండికేట్‌ను(Child Trafficking Racket) ఢిల్లీ పోలీసులు ఛేదించారు....

ఢిల్లీలో Child Trafficking Racket గుట్టు రట్టు...8మంది అరెస్ట్

న్యూఢిల్లీ: పిల్లల అక్రమ రవాణాదారుల సిండికేట్‌ను(Child Trafficking Racket) ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులైన ఆరుగురు మహిళలతో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఓ చిన్నారిని రక్షించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఈ కేసులో నిందితులు నీతు, సోనియా, వినీత్, మీనాగా గుర్తించారు. నలుగురు నిందితులందరూ ఢిల్లీ నివాసితులని పోలీసులు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నివాసితులు రేఖా అగర్వాల్, మోనీ బేగం,హర్యానా నివాసితులు పింకు దేవి, దిగ్విజయ్ సింగ్ లను కూడా అరెస్ట్ చేశారు.ఢిల్లీ మహిళా కమిషన్ కౌన్సెలర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. మే 11న తన స్నేహితుడి ద్వారా మూడు రోజుల పసికందును విక్రయించినట్లు సమాచారం అందిందని డీసీపీ సౌత్ పేర్కొన్నారు.


ఢిల్లీ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.విచారణలో నీతు, ఆమె సహచరుల పాత్ర బయటపడింది. గత ఏడాది అక్టోబర్‌లో మాలవ్య నగర్‌లోని మదన్ మోహన్ మాళవీయా నగర్ హాస్పిటల్‌లో నీతు మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెరిఫికేషన్‌లో వెల్లడైంది.సోనియా అక్టోబర్ 27న నీతును అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసి సంగమ్ విహార్‌లోని తన నివాసానికి తీసుకెళ్లారు. మరుసటి రోజు మీనా ద్వారా ఆమె తన బిడ్డను ఘజియాబాద్‌లోని ప్రతాప్ విహార్‌లోని నర్సింగ్‌హోమ్ లో 5 లక్షల రూపాయలకు విక్రయించిందని పోలీసులు తెలిపారు.నిందితుడు వినీత్ సహ నిందితులైన నీతూ, సోనియా, పాపను ఆనంద్ పర్బత్ ద్వారా గాజియాబాద్‌లోని నెహ్రూ నగర్‌కు తీసుకెళ్లారు.విచారణ సందర్భంగా నిందితులను అరెస్టు చేశారు. జూన్ 7న బాధితురాలి బిడ్డను నిందితులైన దిగ్విజయ్ సింగ్, పింకూ దేవిల నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి క్షేమంగా, ఆరోగ్యంగా ఉందని పోలీసు అధికారి తెలిపారు.






Updated Date - 2022-06-18T13:17:01+05:30 IST