పెద్దాసుపత్రిలో ‘ప్రసవ’ వేదన

ABN , First Publish Date - 2021-12-04T05:38:43+05:30 IST

పురిటి నొప్పులతో వస్తున్న గర్భిణులకు అక్కడ వైద్యం అందించే వారు ఎంత కష్ట పెడుతున్నారో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే కళ్లకు కనపడుతుంది.

పెద్దాసుపత్రిలో ‘ప్రసవ’ వేదన
హిందూపురం ప్రభుత్వ మాత శిశు వైద్యశాల

-  ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే రెఫర్‌ 

- సిజరిన భయంతో ‘ప్రైవేట్‌’కు పరుగులు

హిందూపురం టౌన, డిసెంబరు 3: పురిటి నొప్పులతో వస్తున్న గర్భిణులకు అక్కడ వైద్యం అందించే వారు ఎంత కష్ట పెడుతున్నారో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే కళ్లకు కనపడుతుంది. కడుపు పండిందని వస్తే వైద్యులు వైఖరి  చూస్తే వారికి కడుపు మండుతుంది.  హిందూపురం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో గర్భవతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. అనంతపురం తరువాత హిందూపురంలో జిల్లా ఆసుపత్రి ఉంది. నిత్యం ఇక్కడికి పదుల సంఖ్యలో ప్రసవాలకు వస్తుంటారు. కానీ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలు మాత్రం బిడ్డ అడ్డం తిరిగిందని ఉమ్మనీరుందంటూ వెంటనే సిజరింగ్‌ చేయాలని ఆసుపత్రికి వచ్చిన వారికి సూచనలిస్తుంది. అంతేకాదు ఆరోగ్యశ్రీ ఉందని ఉచితంగానే అక్కడ ప్రసవం చేస్తారంటూ ఉచిత సలహా ఇస్తారు. దీంతో వచ్చిన గర్బవతిని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన చేస్తారు. మరికొన్నయితే ఇక్కడ ఇలాంటివాటికి ఇబ్బందిగా ఉంటుందని అనంతపురానికి రెఫర్‌ చేస్తారు. అయితే కొన్ని ఆరోగ్యశ్రీ కింద రానివాటిని ఇబ్బందిగా ఉంటుందని ప్రాణాపాయస్థితి ఉందని వెంటనే బెంగళూరు, అనంతపురం వెళ్లాలని సూచిస్తారు. కానీ ఇటీవల ఓ గర్భిణికి ఇదేవిధంగా సీరియస్‌గా ఉందంటూ అనంతపురానికి రెఫర్‌ చేశారు. కానీ మార్గమధ్యంలోనే ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చి  క్షేమంగా ఇంటికి తిరిగివచ్చింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.  పలుసార్లు హిందూపురం ప్రభుతత్వ ఆసుపత్రిలో ప్రసవానికి వెళ్లిన గర్భవతులను వేధిస్తున్న తీరుపై ఎమ్మెల్సీ, కలెక్టర్‌, ఆరోగ్యశాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారి ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తూ సదరు వైద్యురాలు బరితెగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు గైనకాలజి్‌స్టలుండగా వారిలో ఒక వైద్యురాలు హిందూపురంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేయడం సాధారణమైంది. తాజాగా గురువారం షబీన అనే గర్భవతి ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. కానీ ఇక్కడ కాదంటూ ప్రైవేట్‌ ఆసుపతిల్రో ఆరోగ్యశ్రీ కింద రెఫర్‌ చేస్తారంటూ కానీ అక్కడికెళ్లాక ఆధార్‌లో వయసు తక్కువగా ఉందంటూ ఆరోగ్యశ్రీ వర్తించదన్నారు. చివరకు వారు పడిన పాట్లు చెప్పనలవి కావు. అదేవిధంగా 20రోజుల క్రితం పరిగి, హిందూపురం మండలాలకు చెందిన ఇద్దరు గర్భిణులను 108లో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ వారికి తగినన్ని వసతులు  లేవని పెద్ద ప్రాణానికే ముప్పు ఉందని అనంతపురానికి తీసుకెళ్లాలన్నారు. దీంతో వారిని అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే  సాధారణ ప్రసవాలు జరిగాయి. ప్రతినెలా కనీసం ఇలాంటి సంఘటనలు పది వరకు చోటుచేసుకున్నా ప్రభుత్వ వైద్యుల్లో మాత్రం మార్పు రాలేదంటూ పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. 15రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌  నాగలక్ష్మి హిందూపురంలో ప్రభుత్వ వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇబ్బందికరంగా ఉంటేతప్ప ఇక్కడే ప్రసవాలు జరగాలంటూ ఆదేశించారు. అయినా కలెక్టర్‌ ఆదేశాలను బేఖాతరుచేస్తూ ప్రైవేట్‌ క్లీనిక్‌లకు పంపడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈవిషయమై సదరు వైద్యాధికారిపై ఆరోగ్యశాఖ మంత్రికి ఎమ్మెల్సీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రతిరోజూ 3నుంచి ఐదు కేసుల దాకా సిజరినకు రెఫర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకు ప్రసవాలకోసం 400 మంది వస్తుండగా ఇందులో 250మంది ఆసుపత్రిలో ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులోకూడా 100దాకా సిజరిన, 150సాధారణం జరుగుతున్నట్లు సమాచారం. 

ఇబ్బంది ఉంటేనే రెఫర్‌ చేయాలి : రమే్‌షనాథ్‌, డీసీహెచఎ్‌స 

ప్రసవం కోసం ప్రభుత్వఆసుపత్రికి వచ్చే గర్భిణులకు చాలా ఇబ్బందికరంగా ఉంటేనే బయటకు రెఫర్‌ చేయాలి. సాధారణ ప్రసవమయ్యేవారిని బయటకు పంపితే అలాంటి వాటిపై లోతుగా విచారించి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు చాలా మెరుగ్గా ఉన్నాయి. అలాంటప్పుడు బయటకు రెఫర్‌ చేయాల్సిన అవసరం లేదు. 


Updated Date - 2021-12-04T05:38:43+05:30 IST