108 వాహనంలోనే ప్రసవం

ABN , First Publish Date - 2021-03-02T05:43:02+05:30 IST

మండలంలోని బాటజంగాలపాలెం గ్రామంలో ఓ తల్లి 108 అంబులెన్స్‌లోనే ప్రసవించింది. అనంతరం తల్లీబిడ్డను 108 సిబ్బంది సబ్బవరం పీహెచ్‌సీకి తరలించారు.

108 వాహనంలోనే ప్రసవం
108 వాహనంలో తల్లీబిడ్డతో సిబ్బంది

తల్లీబిడ్డ క్షేమం

సబ్బవరం, మార్చి 1 : మండలంలోని బాటజంగాలపాలెం గ్రామంలో ఓ తల్లి 108 అంబులెన్స్‌లోనే ప్రసవించింది. అనంతరం తల్లీబిడ్డను 108 సిబ్బంది సబ్బవరం పీహెచ్‌సీకి తరలించారు. గ్రామానికి చెందిన బి. సూర్యకళ అనే నిండు గర్భిణి నుంచి ఆదివారం రాత్రి 2.43 గంటలకు 108 సిబ్బందికి ఫోన్‌  వచ్చింది. అంబులెన్స్‌ సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకుని ఆమెను వాహనంలోకి చేర్చారు. అయితే అప్పటికే పురిటి నొప్పులు మొదలవడంతో 108 సిబ్బంది స్థానికుల సహాయంతో సూర్యకళకు పురుడు పోశారు. ఆమె ఆడ శిశువును ప్రసవించింది. బిడ్డ బరువు 3.24 కిలోలు ఉండడమే కాకుండా ఆరోగ్యంగా ఉందని పీహెచ్‌సీ వైద్యులు తెలిపారు. 108 అంబులెన్స్‌ సిబ్బంది కె.సతీశ్‌, జి.సంజీవరావును గ్రామస్థులు అభినందించారు.

Updated Date - 2021-03-02T05:43:02+05:30 IST