ఇంట్లో చిన్నపిల్లల్ని వదిలి పనికి వెళ్లిన తల్లిదండ్రులు.. తిరిగొచ్చేసరికి మాయమైన చిన్నారి.. అనుకోకుండా గుజరాత్‌లో లభ్యం.. దుండగులెవరంటే..

ABN , First Publish Date - 2021-12-14T07:14:47+05:30 IST

భార్యాభర్తలిద్దరూ కూలిపనికి వెళ్లేవారు. వారికి ఆరుగురు పిల్లలున్నారు. చిన్నపిల్లల్ని ఇంట్లో పెద్దపాపకు అప్పచెప్పి వారిద్దరూ ఒకరోజు పనికి వెళ్లారు. సాయంత్రం పనినుంచి తిరిగిరాగేనే అందరికంటే చిన్న వయసుకల పాప...

ఇంట్లో చిన్నపిల్లల్ని వదిలి పనికి వెళ్లిన తల్లిదండ్రులు.. తిరిగొచ్చేసరికి మాయమైన చిన్నారి.. అనుకోకుండా గుజరాత్‌లో లభ్యం.. దుండగులెవరంటే..

భార్యాభర్తలిద్దరూ కూలిపనికి వెళ్లేవారు. వారికి ఆరుగురు పిల్లలున్నారు. చిన్నపిల్లల్ని ఇంట్లో పెద్దపాపకు అప్పచెప్పి వారిద్దరూ ఒకరోజు పనికి వెళ్లారు. సాయంత్రం పనినుంచి తిరిగిరాగేనే అందరికంటే చిన్న వయసుకల పాప మాయమైంది. పాపకోసం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు దర్యప్తు చేసి పాప గుజరాత్‌లో ఉన్నట్లు చెప్పారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జైని నగరంలో జరిగింది.


పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జైని నగరంలో నివసించే రాజేశ్ మాలవీకు ఆరుగురు పిల్లలున్నారు. అతను తన భార్యతో కలిసి కూలీపని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఒకరోజు పిల్లల్ని ఇంట్లో వదిలి పనికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు కనబడడం లేదు. మాయమైన ఆ ఇద్దరు పిల్లల్లో ఒకరి వయసు 6 ఏళ్లు కాగా.. మరొకరు 1.5 సంవత్సరాల చిన్నారి.


రాజేశ్, అతని భార్య పిల్లల్ని వెతుకుతూ ఉండగా.. ఆరేళ్ల పాప ఊరి చివర కనిపించింది. పాపని ఏం జరిగిందని తండ్రి ప్రశ్నించగా.. ఇధ్దరు వ్యక్తులు బైక్‌మీద వచ్చి ఇంటి బయట ఆడుకుంటున్న తనని, చిన్నారిని చాక్లెట్ చూపి బైక్‌పై తీసుకెళ్లారని చెప్పింది. దీంతో రాజేశ్, అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవి వీడియోలు పరిశీలించి పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసినట్టు కనిపించింది. 


కిడ్నాపర్ల బైక్ నెంబర్ ఆధారంగా పోలీసులు గుజరాత్ వెళ్లారు. అక్కడ ఒక జాతరలో ఒక దంపతుల జంట కిడ్నాప్‌కు గురైన పాపను ఎత్తుకొని ఉన్నారు. పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. వారిని కిడ్నాప్ ఎందుకు చేశారని ప్రశ్నించగా.. తమకు పిల్లలు లేకపోవడంతో పాపను పెంచుకునే ఉద్దేశ్యంతో కిడ్నాప్ చేశామని చెప్పారు. చివరికి పోలీసులు కిడ్నాపర్లపై కేసు నమోదు చేసి.. పాపను రాజేశ్ దంపతులకు అప్పగించారు.

Updated Date - 2021-12-14T07:14:47+05:30 IST