బాలల సంక్షేమానికి సమన్వయంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2020-12-04T03:51:22+05:30 IST

బాలల సంక్షేమ కోసం అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యులు అరికెల దేవయ్య అన్నారు.

బాలల సంక్షేమానికి సమన్వయంతో పనిచేయాలి
సమావేశంలో పాల్గొన్న అధికారులు

-రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యులు అరికెల దేవయ్య

ఆసిఫాబాద్‌, డిసెంబరు3: బాలల సంక్షేమ కోసం అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యులు అరికెల దేవయ్య అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌తో కలిసి వివిధ శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు విద్య, వైద్యం, ఆరోగ్య కోసం క్షేత్రస్థాయిలో ఆయా శాఖలు కృషి చేస్తాయన్నారు. విద్యతో పాటు వైద్యం బాలల సంక్షేమంతో పాటు వారికి అందించే పౌష్టిక ఆహార సేవలు, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ద్వారా గిరిజన ప్రాంఆల్లో మెరుగైన సేవలు అందించాలన్నారు. పిల్లలకు సేవ చేయడం మనవంతు బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యులు సూచించారు. అన్ని శాఖలు ఆ దిశగా కృషి చేయాలని అన్నారు. పిల్లలకు అనుగుణంగా వాళ్ల సంక్షేమం మెరుగైన సేవలు అందించుటకు గాను తగు ప్రణాళిక అమలుతో పాటు పిల్లలందరిని ఆయా పాఠశాలోల్ల చేర్పించేందుకు ముందుకు వెళ్లాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో బాలల సంక్షేమం కొరకు ముందుకు వెళ్లాలని అన్నారు. ప్రతి మూడు నెలలకోసారి అన్ని శాఖలతో సమీక్షించడం జరుగుతుందన్నారు. 

కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మాట్లాడుతూ బాల కార్మికులు లేకుండా జిల్లాలో పూర్తిగా అన్ని శాఖల సమన్వయంతో చేయాలని, విద్య, వైద్య పరంగా బాలల హక్కులను రక్షించాలని, భవిష్యత్‌లో అధికారులదే బాధ్యత అని, విద్య, వైద్యం రంగాల్లో వారిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని, కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ రాకుండా వృద్దులు, పిల్లలకు తగిన జాగ్రత్తలతో పాటు వారిని రక్షించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల రక్షణకు వివిధ శాఖలు మరింత బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. జిల్లా విద్యా శాఖ, వైద్య, ఆరోగ్య, సాంఘీక సంక్షేమ, వెనకబడిన తరగతుల సంక్షేమం, బాలల పరిరక్షణ విభాగం, మహిళా శిశు సంక్షేమం శాఖల వారిగా బాలల సంక్షేమం స్థితి గతులపై సమీక్ష జరిపి పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాంబాబు, మహిళా శిశు సంక్షేమాధికారి సావిత్రి, జిల్లా వైద్యాదికారి కుంరం బాలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T03:51:22+05:30 IST