పిల్లలే దేశ సంపద.. వారి బాధ్యత మనదే

ABN , First Publish Date - 2021-03-07T05:02:46+05:30 IST

పిల్లలే దేశ సంపద.. వారిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్‌ హరీష్‌ అన్నారు.

పిల్లలే దేశ సంపద.. వారి బాధ్యత మనదే
అవగాహనా సదస్సులో మాట్లాడుతున్న మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీష్‌

చట్టాలను కచ్చితంగా అమలు చేసి బంగారు భవిష్యత్తును అందిద్దాం

బాలల రక్షణ చట్టాల అవగాహన సదస్సులో మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీష్‌

మెదక్‌ రూరల్‌, మార్చి 6 : పిల్లలే దేశ సంపద.. వారిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్‌ హరీష్‌ అన్నారు. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ, బాలల సంరక్షణ, భద్రత చట్టాలపై స్త్రీశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో అవగాహనా సదస్సును నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడేందుకు రాజ్యాంగం అనేక చట్టాలను తెచ్చిందని, వాటిని కచ్చితంగా అమలుచేసి భావితరాల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. దివ్య దిశ స్వచ్చంద సంస్థ సంచాలకులు ఫిలి్‌ప్సతో బాలలకు ఈ చట్టాలపై అవగాహన కలిగిస్తున్నామన్నారు. నేటి ఆఽధునిక యుగంలోనూ బాలలపై లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, బాల్యవిహాలు జరుగుతండం దురదృష్టకరమన్నారు. బాల కార్మిక వ్యవస్థను కూడా రూపు మాపాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య  అతిథిగా హాజరైన ఫస్ట్‌ క్లాస్‌ జూనియర్‌ మేజిస్ట్రేట్‌ సాయి కిరణ్‌ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన చట్టాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాలల సరరక్షణకు రూపొందించిన జేజే, ఫోక్సో చట్టాల ప్రకారం 18 ఏళ్ల లోపు వారందరూ బాలలేనని, వారిపై ఎటువంటి లైంగిక దాడులు, వేధింపులు జరిగినా బాల సంరక్షణ  కమిటీతో పాటు అనుబంధ శాఖలు స్పందించి శిక్ష పడేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి, దివ్య దిశ స్వచ్ఛంద సంస్థ సంచాలకులు ఫిలిప్స్‌, జిల్లా సంక్షేమాధికారి పద్మ, డీఈవో రమేశ్‌కుమార్‌, గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామేశ్వరీదేవి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T05:02:46+05:30 IST