Ukraine Heroes: రష్యా సేనల దాడిని అడ్డుకునేందుకు పిల్లల ముందడుగు

ABN , First Publish Date - 2022-03-05T18:24:36+05:30 IST

రష్యా సైనికుల దాడిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ దేశంలోని ఒడెస్సా నగర పిల్లలు ముందుకు వచ్చి....

Ukraine Heroes: రష్యా సేనల దాడిని అడ్డుకునేందుకు పిల్లల ముందడుగు

ఒడెస్సాలో బారికేడ్ల నిర్మాణం

ఒడెస్సా(ఉక్రెయిన్):రష్యా సైనికుల దాడిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ దేశంలోని ఒడెస్సా నగర పిల్లలు ముందుకు వచ్చి ఉక్రెయిన్ హీరోలుగా నిలిచారు.రష్యా దండయాత్రను ఆపడానికి తాము సైతం అంటూ పిల్లలు ముందుకు వచ్చి ఓడరేవు నగరమైన ఒడెస్సాలో బారికేడ్లు నిర్మిస్తున్నారు. రష్యా సైనికులు సిటీ సెంటరుకు రాకుండా ఉండేలా ఇసుకతో అడ్డగా బారికేడ్లు నిర్మిస్తున్నారు. రష్యా సైనికులు యాచ్ క్లబ్ బీచ్ నుంచి ఇసుకను తీసుకువచ్చి బారికేడ్లను నిర్మిస్తున్నారు. 11 ఏళ్ల వయసు గల పిల్లలు సైతం బారికేడ్ల నిర్మాణంలో మునిగారు.తాము రష్యా దండయాత్ర నుంచి ఒడెసా నగరాన్ని కాపాడుకుంటామని పిల్లలు ఆత్మవిశ్వాసంతో చెప్పారు.


Updated Date - 2022-03-05T18:24:36+05:30 IST