పిల్లలు మాట వినడం లేదా?

Published: Mon, 28 Mar 2022 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పిల్లలు మాట వినడం లేదా?

పిల్లలు పెద్దల మాట వినడం లేదంటే అందుకు కారణం పిల్లల్లోనే కాదు పెద్దల్లోనూ ఉంటుంది. కాబట్టి పెద్దలు తమను తాము ఇలా ప్రశ్నించుకోవాలి.


  • పిల్లలు ఆకలిగా ఉన్నారా లేక అలసిపోయారా?
  •  నేను వాళ్లు చెప్తున్నది ఆలకిస్తున్నానా? సాధారణంగా పిల్లలు పెద్దలనే ఆనుసరిస్తారు. వాళ్లు చెప్తున్నది వినే అలవాటు, ఆసక్తి కనబరిచే అలవాటు పెద్దలకు లేకపోతే, పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు.

  • పిల్లలను ఒత్తిడికి లోను చేస్తున్న అంశాలేవైనా ఉన్నాయా?
  • పిల్లల లేత మనసులను అర్థం లేని భయాలు వేధించే అవకాశం లేకపోలేదు. అలాంటప్పుడు పరధ్యానంలో పడతారు. కాబట్టి వాళ్లను ఆందోళనకు గురి చేస్తున్న అంశాల గురించి ఆరా తీయాలి.

  • నలతగా ఉన్నప్పుడు కూడా పిల్లలు మాటలకు స్పందించరు. కాబట్టి పిల్లల్లో హుషారు తగ్గిందేమో గమనించాలి.
  • విసుక్కోవడం, చీదరించుకోవడం, కోపం ప్రదర్శించడం... పెద్దలు ఇలా ప్రవర్తించినప్పుడు కొందరు పిల్లలు నిశ్శబ్దంగా మారిపోతారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పరు. పిలిచినా పలకరు. కాబట్టి పెద్దలు ఓర్పుతో, నేర్పుతో కారణాన్ని తెలుసుకుని, ప్రేమతో మాట్లాడుతూ పిల్లల మనసులను తేలిక పరచాలి. 
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.