పూజల పేరుతో కన్న పిల్లలను చంపేందుకు యత్నించిన తండ్రి

ABN , First Publish Date - 2022-06-15T22:06:06+05:30 IST

జిల్లాలోని ఆత్మకూరు పెరారెడ్డిపల్లెలో దారుణం జరిగింది. శాంతి పూజల పేరుతో కన్న పిల్లలనే చంపేందుకు

పూజల పేరుతో కన్న పిల్లలను చంపేందుకు యత్నించిన తండ్రి

నెల్లూరు: జిల్లాలోని ఆత్మకూరు పేరారెడ్డిపల్లెలో దారుణం జరిగింది. శాంతి పూజల పేరుతో కన్న పిల్లలనే చంపేందుకు ఓ తండ్రి ప్రయత్నించాడు. పూర్విక, పునర్విక అనే కవల పిల్లలను తండ్రి వేణు గదిలోకి తీసుకెళ్లి పూజులు చేశాడు. ఆ తర్వాత పునర్విక గొంతు నులమడంతో పూర్విక భయపడి కేకలు వేస్తూ బయటకు వచ్చింది. దీంతో స్థానికలు ఇంట్లోకి వెళ్లి చూడగా వేణు క్షుద్రపూజులు చేస్తున్నట్లు గుర్తించారు. అప్పటికే పునర్విక అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను స్థానికలు సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన పోలీసుల దృష్టికి చేరడంతో వేణును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-06-15T22:06:06+05:30 IST