పిల్లలు వాహనం నడిపితే తల్లిదండ్రులకు జైలు

ABN , First Publish Date - 2022-05-03T15:49:12+05:30 IST

పిల్లలు వాహనం నడిపేందుకు అనుమతించే తల్లిదండ్రులకు మూడేళ్లు జైలుశిక్ష విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లలోపున్న

పిల్లలు వాహనం నడిపితే తల్లిదండ్రులకు జైలు

ఐసిఎఫ్‌(చెన్నై): పిల్లలు వాహనం నడిపేందుకు అనుమతించే తల్లిదండ్రులకు మూడేళ్లు జైలుశిక్ష విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లలోపున్న బాలబాలికలు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవడంతో పాటు ఇతరుల ప్రాణాలు కోల్పోవడానికి కారణం అవుతున్నారు. తండ్రి ద్విచక్రవాహనాన్ని నడిపిన యువకుడు తిరుచెందూర్‌ కొల్లపట్టి పోలీస్ స్టేషన్‌ సమీపంలో ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ వ్యవహారంలో బాలుడు తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇలా అరెస్ట్‌ చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ, 2019లో సవరించిన మోటారు వాహన చట్టం ప్రకారం 19 ఏళ్లలోపున్న వారు లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాలు జరుపుతున్నారని, వారికి వాహనాలిచ్చే తల్లిదండ్రులకు మూడేళ్లు జైలు, రూ.25 వేల జరిమానా విధించేలా కేసు నమోదుచేస్తున్నామని తెలిపారు.

Read more