పిల్లలు మాస్క్‌ పెట్టుకోకపోతే...

ABN , First Publish Date - 2021-06-12T15:58:00+05:30 IST

కరోనా తీవ్రత కాస్త తగ్గినా మాస్క్‌ వాడకం తప్పనిసరి. అయితే కేంద్రప్రభుత్వం మాత్రం ఐదేళ్లలోపు చిన్నారులకు ముఖాన్ని పూర్తిగా కవర్‌ చేసి ఉండటం మంచిది కాదంటుంది. అలా చేస్తే శ్వాస సమస్య

పిల్లలు మాస్క్‌ పెట్టుకోకపోతే...

ఆంధ్రజ్యోతి(12-06-2021)

కరోనా తీవ్రత కాస్త తగ్గినా మాస్క్‌ వాడకం తప్పనిసరి. అయితే కేంద్రప్రభుత్వం మాత్రం ఐదేళ్లలోపు చిన్నారులకు ముఖాన్ని పూర్తిగా కవర్‌ చేసి ఉండటం మంచిది కాదంటుంది. అలా చేస్తే శ్వాస సమస్య వచ్చి కళ్లు తిరిగి పడిపోయే అవకాశం ఉంటుందని చెబుతోంది. ఇలాంటి తరుణంలో చంటిపిల్లలకు మాస్క్‌ పెట్టాలా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది.


ఇంటినుంచి బయటకు వస్తే..  పెద్దపిల్లలకు మాస్క్‌ ఉంటుంది, చంటిపిల్లలకు మాత్రం మాస్క్‌ ఉండకపోవటం గమనిస్తుంటాం. చంటిపిల్లలకు మాస్క్‌ ఉండదు. ఎందుకంటే.. మాస్కు పెట్టినా వారు క్షణాల్లో తీసి విసిరేస్తారు. మళ్ళీ బలవంతంగా మాస్క్‌ పెడితే మాత్రం గుక్క తిప్పుకోకుండా ఏడుస్తారు. అయితే ఇలాంటప్పుడు ఏమి చేయాలి అన్నది తల్లిదండ్రులకు తోచదు. మాస్క్‌లు కుట్టించినా, గాలి ధారాళంగా వచ్చే మాస్క్‌లు పెట్టినా పిల్లలకు అవి నచ్చవు. ఒక విధమైన ఇబ్బందికి గురవుతారు. పిల్లలను తీసుకుని ఫంక్షన్లకో, షాపింగ్‌కో వెళ్లినపుడు సమూహంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా బ్యాక్టీరియా, వైరస్‌ ప్రభావాలను తగ్గించలేం. అలాంటప్పుడు అమ్మానాన్నలు కొన్ని మెలకువలు పాటించాల్సిందే.


నెలల బిడ్డ అయితే బేబీ క్యారియర్‌లో అయినా తీసుకెళ్లాలి. లేకపోతే బిడ్డ ముఖాన్ని తల్లి తన వైపునకు తిప్పుకోవాలి. వీలైనంతగా తల్లి శరీరానికి దగ్గరగా ఉండాలి.


పిల్లలను కారులో తీసుకెళితే బిడ్డచుట్టూ క్యాబ్‌లలోగా ప్లాస్టిక్‌ కవర్‌ ప్రొటెక్టర్‌ ఉండాలి.


పొరబాటున కూడా చిన్నారుల దగ్గరకు ఇతరులు వచ్చినా తాకనివ్వరాదు. మీటరు దూరంలో ఉండేట్లు చూసుకోవాలి. దూరం నుంచే మాట్లాడటం మంచిది.


వీలైనంతగా ముందస్తు జాగ్రత్తగా పిల్లలను బయటకు తీసుకెళ్లకపోవడమే మంచిది.


మూడు సంవత్సరాల పిల్లలకు ఇష్టమైన బొమ్మలుండే మాస్క్‌లు కొనాలి. అప్పుడే మాస్కులపై ఆసక్తి పెరుగుతుంది. అవి కూడా చెవులకు కంఫర్ట్‌గా ఉన్నాయా.. రెండు లేదా మూడు పొరలున్నాయా.. అసలు గాలి పీల్చుకోవటానికి అనుకూలంగా ఉన్నాయా.. అనేది చూసుకోవడం తప్పనిసరి.


Updated Date - 2021-06-12T15:58:00+05:30 IST