మిరప విత్తనం క్వింటా రూ.90 వేలు

ABN , First Publish Date - 2021-06-21T06:49:18+05:30 IST

మండలంలో ఖరీఫ్‌ సీజన మిరప పం ట సాగుకు అదును ముంచుకొస్తోంది. గుంతకల్లు బ్రాంచ కెనాల్‌ (జీ బీసీ)కు సాగు నీరు అందేలోపు నారు సిద్ధం చేసుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.

మిరప విత్తనం క్వింటా రూ.90 వేలు
నారు పోసేందుకు సిద్ధమైన మిరప విత్తనాలు

ఘాటెక్కిన విత్తన ధర

వేల ఎకరాల్లో మిరప సాగుకు రైతులు సన్నద్ధం

విత్తనానికి పెరిగిన డిమాండ్‌ 

జీబీసీకి నీరొచ్చేలోపు నారు సిద్ధం 


విడపనకల్లు, జూన 20: మండలంలో ఖరీఫ్‌ సీజన మిరప పం ట సాగుకు అదును ముంచుకొస్తోంది. గుంతకల్లు బ్రాంచ కెనాల్‌ (జీ బీసీ)కు సాగు నీరు అందేలోపు నారు సిద్ధం చేసుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. దీంతో విత్తన మిరపకు డిమాండ్‌ పెరిగింది. ఇ దే అదునుగా వ్యాపారులు ధరల ఘాటెక్కించారు. ఇంకేముందు కిలో మిరప విత్తనం బహిరంగ మార్కెట్లో రూ.90 వేలు పైమాటే పలుకు తోంది. మండలంలోని వేల్పుమడుగు, జనార్ధనపల్లి, కరకముక్కల, వి డపనకల్లు, వీ కొత్తకోట, ఆర్‌ కొట్టాల రైతులతో పాటు ఉరవకొండ, బ ళ్లారి, అనంతపురం, గుంతకల్లు తదితర పట్టణాల నుంచి రైతులు విడపనకల్లు వచ్చి మిరప విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. 


భారీగా వెలసిన దుకాణాలు

మిరప సాగు చేసే సమయం దగ్గర పడటంతో మండల కేంద్రమైన విడపనకల్లులో మిరప విత్తనాలు అమ్మే వ్యాపార దుకాణాలు భారీగా వెలిశాయి. ప్రస్తుతం డబ్బి రకం విత్తనం క్వింటా రూ.95 వేలు, గుం టూరు రకం (కారం కాయలు) రూ.90 వేలు, డబ్బిలో మరో రకం డీ లక్స్‌ విత్తనం రూ.90 వేలు, కడ్డీ రకం కాయలు రూ.85 వేలు ధర ఉ న్నట్లు రైతులు తెలుపుతున్నారు. నేరుగా విత్తనాన్ని కొనాలంటే కర్ణాట కలోని హుబ్లి, బ్యాడిగ, గదగ్‌, ఆంధ్రలోని గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవల్సి వస్తోంది. అదే విడపనకల్లులో విత్తనకాయలు కొని మిషనకు వేసుకోవటం వల్ల కొంత మేరకు ఖర్చులు తగ్గుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఒక క్వింటా మిరపకాయలు కొనుగోలు చేసి మిషనకు వేసుకోవటం వల్ల దాదాపుగా 40 నుంచి 50 క్వింటాళ్ల విత్తనాలు వస్తాయి. ఒక క్వింటా మిరపకాయలు రూ.38వేలకు  కొనుగోలు చేస్తే 50 కేజీలు మాత్రమే విత్తనాలు వస్తాయి. దీనివల్ల రైతుకు ఓ క్వింటా విత్తనంపైన దాదాపుగా రూ.20వేలు తగ్గుతుంది. అందువ ల్ల రైతులు విడపనకల్లులోనే మిరపకాయలు కొని మిషనకు ఆడించి విత్తనాలను సిద్ధం చేసుకుంటున్నారు.


మొదటి వారంలో నాట్లు ప్రారంభం

ప్రతి సంవత్సరం జులై నెలలో జీబీసీకి సాగునీరు వస్తుండటంతో రైతులు మిరప సాగుకు సిద్ధమవుతున్నారు. విడపనకల్లు మండలంతో పాటు ఉరవకొండ, గుంతకల్లు ప్రాంతాల్లోనూ జూలై మొదటి వారం లో మిరప పంట సాగు చేస్తారు. ఎకరంలో మిరప సాగుకు మూడు కిలోల విత్తనం అవసరముంటుంది. కిలో విత్తనం ధర రూ.3వేలు ప్ర కారం ఎకరానికి రూ.9వేలు ఖర్చు అవుతుంది. ఒక్కొక్క రైతు దాదాపు గా 5 నుంచి 10 ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు. ఇక కౌలు రైతులు అయితే పొలం స్వభావాన్ని బట్టి కౌలు నిర్ణయిస్తారు. విద్యుత, బోరుబావి ఉన్న పొలానికి ఎకరాకు రూ.45వేల నుంచి రూ.50 వేలు పైనే కౌలు నిర్ణయించి మిరప పంటను సాగు చేస్తారు. ఇక జీబీసీ కాలు కింద రైతులు పొలాలు నీరు పారకున్నా దానికి దాదాపుగా రూ.30వేల నుంచి రూ.40వేలు  కౌలుకు తీసుకుంటున్నారు. ఎక్కడైనా బోరు ఉన్న పొలం ఉంటే దాని విలువ వేలల్లోనే పలుకుతుంది. దీంతో విడపనకల్లు మండలంలో మిరప రైతుల హడావుడి మొదలైయింది. 


గతేడాది మిరప గోడౌన్లలోనే..

మండల రైతులు దాదాపుగా వేల క్వింటాళ్ల మిరపకాయలు కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాతాల్లో ఏసీ గోడౌన్లలో ఉంచారు. కరోనాతో మిరప పంటకు సరైన గిట్టు బాటు ధర రాక పోవటంతో రైతులు వేల క్వింటా ళ్ల మిరప పంటను బళ్లారి, హుబ్లీ, బ్యాడిగ ప్రాంతాల్లోని గోడౌన్లలో ఉంచినట్లు తెలుపుతున్నారు. గతంలో వచ్చిన పంట అమ్ముడు పోక ధ రలు లేక గోడౌన్లలో నిలువ ఉంచి ధరలు కోసం ఎదురు చూస్తున్నారు. మిర్చి పంట డబ్బు చేతికి రాకనే మళ్లీ మిరప సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. బోరుబావుల కింద జీబీసీ కాలువ కింద వేల ఎకరాల్లో మిరప పంట సాగు చేసేందుకు రైతులు ముమ్మరంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.



Updated Date - 2021-06-21T06:49:18+05:30 IST