పండుమిర్చి- అల్లం పచ్చడి

ABN , First Publish Date - 2021-01-30T19:46:06+05:30 IST

పండుమిరపకాయలు - పది, అల్లం - 20గ్రా, ఆవాలు - అర టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, సెనగపప్పు - అర టీస్పూన్‌, ఎండుమిరపకాయలు - రెండు, కరివేపాకు -

పండుమిర్చి- అల్లం పచ్చడి

కావలసిన పదార్థాలు: పండుమిరపకాయలు - పది, అల్లం - 20గ్రా, ఆవాలు - అర టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, సెనగపప్పు - అర టీస్పూన్‌, ఎండుమిరపకాయలు - రెండు, కరివేపాకు - రెండు రెమ్మలు, వెల్లుల్లి - నాలుగైదు రెబ్బలు, పంచ దార - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నిమ్మరసం - అరకప్పు, మెంతిపొడి - చిటికెడు, - నూనె - అరకప్పు, ఇంగువ - చిటికెడు.


తయారీ విధానం: ముందుగా అల్లంను మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. తరువాత అందులో పండు మిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసి మళ్లీ గ్రైండ్‌ చేయాలి. తరువాత అందులో పంచదార, మెంతిపొడి వేసి మరొకసారి గ్రైండ్‌ చేయాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్‌పెట్టి నూనె వేయాలి. నూనె కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి వేగిన తరువాత సెనగపప్పు  ఇంగువ వేయాలి. వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలియబెట్టాలి. చివరగా గ్రైండ్‌ చేసి పెట్టుకున్న పండుమిర్చి-అల్లం మిశ్రమం వేసి కలపాలి. కాసేపు చిన్నమంటపై ఉంచి దింపాలి. అన్నంలోకి, చపాతీలోకి ఈ పచ్చడి టేస్టీగా ఉంటుంది.


Read more