చిల్లీ పనీర్‌

ABN , First Publish Date - 2021-04-23T18:16:40+05:30 IST

పనీర్‌- 250 గ్రాములు, ఉల్లిపాయలు- రెండు, కార్న్‌ పొడి - మూడు స్పూన్లు, మైదా- మూడు స్పూన్లు, అల్లం, వెల్లుల్లి పేస్టు- స్పూను, మిరియాల పొడి- పావు స్పూను, ఉప్పు, నీరు- తగినంత, నూనె- మూడు స్పూన్లు, పచ్చిమిర్చి- మూడు (సన్నగా కట్‌ చేసినవి), క్యాప్సికం

చిల్లీ పనీర్‌

కావలసిన పదార్థాలు: పనీర్‌- 250 గ్రాములు, ఉల్లిపాయలు- రెండు, కార్న్‌ పొడి - మూడు స్పూన్లు, మైదా- మూడు స్పూన్లు, అల్లం, వెల్లుల్లి పేస్టు- స్పూను, మిరియాల పొడి- పావు స్పూను, ఉప్పు, నీరు-  తగినంత, నూనె- మూడు స్పూన్లు, పచ్చిమిర్చి- మూడు (సన్నగా కట్‌ చేసినవి), క్యాప్సికం- మధ్యరకంగా ఉన్నది ఒకటి , సోయా సాస్‌, రెడ్‌ చిల్లీ సాస్‌ - చెరో రెండు స్పూన్లు, కారం పొడి- అర స్పూను, వెనిగర్‌- అర స్పూను.


తయారు చేసే విధానం: ఓ గిన్నెలో రెండు స్పూన్ల కార్న్‌ పొడి, మైదా, అల్లం వెల్లుల్ని పేస్టు, మిరియాల పొడి, కారం పొడి వేసుకుని బాగా కలిపి నీటిని జతచేసి జారుగా చేసుకోవాలి. తరవాత దీనిలో పనీరు ముక్కల్ని వేసి స్పూనుతో కలపాలి. ఓ పాన్‌లో మూడు స్పూన్ల నూనెవేసి కాగాక పనీరు ముక్కల్ని వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో ఎర్ర మిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా రంగు మారాక, క్యాప్సికం ముక్కల్ని వేసి మగ్గించాలి. దీనికి సోయా సాస్‌, రెడ్‌ చిల్లీ సాస్‌ వేసి బాగా కాలిపి అర కప్పు నీళ్లు పోసి ఓ మోస్తరు సెగలో ఉడికించాలి. ఈలోపు ఓ చిన్న కప్పులో మిగిలిన కార్న్‌ పొడి వేసి నీటితో కలుపుకోవాలి. దీన్ని వేసి ఉడికిస్తే గ్రేవీ అంతా చిక్కపడుతుంది. దాంట్లో వేయించిన పనీరు ముక్కలు, వెనిగర్‌, ఉప్పు కూడా వేసి కాసేపు ఉడికిస్తే చిల్లీ పనీరు తయార్‌!


Updated Date - 2021-04-23T18:16:40+05:30 IST