ICBC-గోల్డ్‌మ్యాన్ JVకి చైనా ఆమోదం

ABN , First Publish Date - 2022-06-25T00:25:20+05:30 IST

చేందుకుగాను దేశ బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆమోదం పొందినట్లు ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా((ICBC) శుక్రవారం తెలిపింది.

ICBC-గోల్డ్‌మ్యాన్ JVకి చైనా ఆమోదం

బీజింగ్ : గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ ఇంక్‌తో తన సంపద నిర్వహణ జాయింట్ వెంచర్ కార్యకలాపాలను ప్రారంభించేందుకుగాను దేశ బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆమోదం పొందినట్లు ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా((ICBC) శుక్రవారం తెలిపింది. చైనా బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ కమిషన్(CBIRC) ఆమోదం ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ తన దిగ్గజం ఆర్థిక రంగాన్ని విదేశీ పెట్టుబడులకు సంబంధించి... దేశీయ బ్యాంకులతో సహకరించేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ నుండి 51 %, ICBC ద్వారా 49 % నిధుల సహకారంతో గత సంవత్సరం మేలో స్థాపితమైన Goldman Sachs ICBC వెల్త్ మేనేజ్‌మెంట్... ఇప్పుడు పరిమాణాత్మక పెట్టుబడి వ్యూహాలు సహా కాలక్రమేణా చైనీస్ మార్కెట్‌కు  విస్తృత శ్రేణి పెట్టుబడి ఉత్పత్తులను అందించనుంది. ICBC "చట్టాలు, నిబంధనలు, నియంత్రణ అవసరాలకు అనుగుణంగా" అన్ని సంబంధిత ప్రక్రియలను అమలు చేసేందుకుగాను జాయింట్ వెంచర్‌ను నడుపుతుందని చైనా  అతిపెద్ద బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2022-06-25T00:25:20+05:30 IST