రష్యా దాడిని వాయిదా వేయించిన చైనా

ABN , First Publish Date - 2022-03-03T21:36:10+05:30 IST

వింటర్ ఒలంపిక్స్ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడిని చైనా కొన్ని వారాలపాటు వాయిదా వేయించిందని అమెరికా వెల్లడించింది. రష్యా, ఉక్రెయిన్‌పై దాడి చేయబోతుందని చాలా కాలం నుంచే వార్తలొచ్చాయి.

రష్యా దాడిని వాయిదా వేయించిన చైనా

వింటర్ ఒలంపిక్స్ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడిని చైనా కొన్ని వారాలపాటు వాయిదా వేయించిందని అమెరికా వెల్లడించింది. రష్యా, ఉక్రెయిన్‌పై దాడి చేయబోతుందని చాలా కాలం నుంచే వార్తలొచ్చాయి. అయితే, రష్యా ముందే దాడికి సిద్ధపడ్డప్పటికీ, తమ దేశంలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ పూర్తయ్యే వరకు ఆగాలని రష్యాను చైనా కోరింది. అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ గ్రూప్ అందించిన సమాచారం ఆధారంగా, యూఎస్ అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం.. వింటర్ ఒలంపిక్స్ పూర్తయ్యే వరకు ఉక్రెయిన్‌పై దాడికి దిగొద్దని రష్యాను చైనా కోరింది. దీనికి అంగీకరించిన రష్యా, వింటర్ ఒలంపిక్స్ ముగిసిన తర్వాతే దాడికి దిగింది. చైనాలో వింటర్ ఒలంపిక్స్ ఫిబ్రవరి 4న మొదలై, 20న పూర్తయ్యాయి. 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించింది. ఒలంపిక్స్ ముగిసన రోజే రష్యా సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించింది. దీన్ని బట్టి, ఈ వార్తలో నిజముందని అమెరికా భావిస్తోంది. అయితే, ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నేరుగా మాట్లాడుకోలేదని అమెరికా తెలిపింది. 

Updated Date - 2022-03-03T21:36:10+05:30 IST