భారత్‌‌కు ఉన్న ప్రత్యేకస్థానం చైనాకు ఎన్నటికీ ఉండదు: నేపాల్

ABN , First Publish Date - 2021-08-15T01:07:12+05:30 IST

నేపాల్‌కు భారత్ ‘ప్రత్యేకమైన’ పొరుగు దేశమని నేపాలీ కాంగ్రెస్ తాజాగా వ్యాఖ్యానించింది. భారత్ స్థానంలోకి చైనా ఎప్పటికీ రాలేదని కూడా పేర్కొంది.

భారత్‌‌కు ఉన్న ప్రత్యేకస్థానం చైనాకు ఎన్నటికీ ఉండదు: నేపాల్

ఖాట్మండూ: నేపాల్‌కు భారత్ ‘ప్రత్యేకమైన’ పొరుగు దేశమని నేపాలీ కాంగ్రెస్ తాజాగా వ్యాఖ్యానించింది. భారత్ స్థానంలోకి చైనా ఎప్పటికీ రాలేదని కూడా పేర్కొంది. నేపాల్ పగ్గాలు చేపట్టి నెల రోజులు పూర్తైన సందర్భంగా నేపాలీ కాంగ్రెస్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది. లింపియదుర-కాలాపానీ-లిపూలేఖ్ ప్రాంతానికి సంబంధించి వివాదానికి దౌత్యపరిష్కారం కనుగొనేందుకు కట్టుబడి ఉన్నామని కూడా కాంగ్రెస్ పేర్కొంది. 


లింపియదూర-కాలాపానీ-లిపూలేఖ్ ప్రాంతాలను నేపాల్ భూభాగాలుగా చూపుతూ రూపొందించిన మ్యాపుకు నేపాల్ పార్లమెంట్ గతేడాది ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త జాతీయ మ్యాపును కూడా నేపాల్ ప్రభుత్వం ఆవిష్కరించింది. కాగా.. నెల రోజల క్రితం షేర్ బహదూర్ దేవుబా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. లింపియదూర-కాలాపానీ-లిపూలేఖ్ వివాదానికి సంబంధించి దౌత్యపరమైన పరిష్కారం కొనుగొనాల్సిన అవసరాన్ని ఈ కార్యచరణలో స్పష్టంగా పేర్కొంది. 

Updated Date - 2021-08-15T01:07:12+05:30 IST