బిల్-మిలిండా గేట్స్ విడాకులపై చైనీయుల ఆసక్తి!

ABN , First Publish Date - 2021-05-06T17:41:05+05:30 IST

`మైక్రోసాఫ్ట్` సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అతని భార్య మిలిండా విడాకుల అంశం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది.

బిల్-మిలిండా గేట్స్ విడాకులపై చైనీయుల ఆసక్తి!

`మైక్రోసాఫ్ట్` సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అతని భార్య మిలిండా విడాకుల అంశం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. 27 సంవత్సరాల వైవాహిక జీవితం అనంతరం వీరు తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందికి జీర్ణం కావడం లేదు.  సాధారణంగా పశ్చిమ దేశాల వ్యాపారవేత్తల గురించి పట్టించుకోని చైనీయులు కూడా ఈ అంశంపై విపరీతంగా స్పందిస్తున్నారు. ట్విటర్‌ను పోలిన చైనా సామాజిక మాధ్యమం `వైబో`లో బిల్-మిలిండా గేట్స్ గురించి రికార్డు స్థాయిలో చర్చ జరుగుతోంది. 


`బిల్ గేట్స్ డైవర్స్` హ్యాష్‌ట్యాగ్‌ 830 మిలియన్ల వ్యూస్‌ను, 66 వేల డిస్కషన్ పోస్ట్‌లను దక్కించుకుంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బొజేస్, మెకంజీ విడాకులకు సంబంధించి ఇప్పటి వరకు 91 మిలియన్ల పోస్ట్‌లు మాత్రమే వచ్చాయి. `మైక్రోసాఫ్ట్` గురించి, గేట్స్ ఫౌండేషన్ ద్వారా బిల్-మిలిండా చేసిన సేవ గురించి చైనీయులు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ఈ విడాకుల కారణంగా వాటి భవితవ్యం ఏమౌతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-05-06T17:41:05+05:30 IST